టాలీవుడ్ ప్రముఖ యాంకర్ ప్రదీప్ ఈరోజు నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. గత ఎడాది డిసెంబర్ 31న నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న ప్రదీప్ మోతాదుకు మించి మద్యం సేవించి ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు ఆయన కారును సీజ్ చేసి కౌన్సిలింగ్ హాజరుకావాలని ఆదేశించారు. కొద్దిరోజుల క్రితం తండ్రితో కలిసి కౌన్సిలింగ్‌కు హాజరైన ప్రదీప్ కొర్టులో హాజరయ్యేందుకు కొంత సమయం అడిగారు. ఈరోజు ప్రదీప్ కొర్టుకు రావడంతో పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచిన తరువాత నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించింది. ప్రదీప్ డ్రైవింగ్ లైసెన్స్‌ను మూడేళ్ల పాటు రద్దు చేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. ప్రదీప్‌కు రూ.2100 జరిమానా విధించింది