2019 సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా ఉన్న పార్లమెంట్ స్థానాల్లో రిపబ్లికన్ టీవీ, ఓ సర్వే నిర్వహించాయి. దీని ప్రకారం 2019లో మళ్లీ ఎన్‌డీఏ అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. ఇక ఏపీలో వైసీపీకి, తెలంగాణలో టీఆర్ఎస్‌కి, తమిళనాడులో రజనీకి ఆధిక్యం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-బీజేపీ కూటమికి 12 పార్లమెంట్ స్థానాలు దక్కుతాయట.. అంటే గత ఎన్నికలతో పోలిస్తే 5 స్థానాలు తగ్గుతాయని అభిప్రాయపడింది. ఏపీలో వైసీపీకి 13 స్థానాలు వస్తాయని తేల్చింది. ఎన్డీఏ మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీని తక్కువ చేసి చూపడం అనుమానాలకు తావిస్తోంది. పోలవరం స్పిల్ వే టెండర్లను నిలిపివేయాల్సిందిగా ఏపీ సర్కార్‌ను కేంద్రప్రభుత్వం ఎప్పుడైతే ఆదేశించిందో అప్పటి నుంచి బీజేపీ-మోడీ బంధం తెగిపోవడానికి కౌంట్‌డౌన్ స్టార్టయ్యిందని అందరూ భావించారు. అంతేగాక కొంతమంది టీడీపీ నేతలు బీజేపీని ఓపెన్‌గానే కార్నర్ చేస్తున్నారు. ఇంకా ఏపీలో ప్రస్తుతం పాదయాత్ర చేస్తున్న జగన్ హవా విపరీతంగా పెరిగిపోయిందని.. మరోవైపు టీడీపీ పాలనతో అక్కడి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చేసిందని.. ఈ నేపథ్యంలో బీజేపీ.. వైసీపీతో దోస్తీకి పూనుకుందని అందులో భాగంగానే.. బీజేపీ సర్వే చేయించి రిజల్ట్ ప్రకటించిందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.
2019 ఎన్నికల్లో టీడీపీ రాదు కాబట్టి…నరేంద్ర మోదీ వైఎస్ జగన్ తో దోస్తీ
Tags 2019 elactiones narendra modi republic media survey ys jagan