కాంట్రవర్సిటీకా బాప్ క్రియేటీవ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నుండి వస్తున్న తాజా సంచలనం గాడ్ సెక్స్ అండ్ ట్రూత్. ఈ షార్ట్ ఫిల్మ్‌లో ప్రముఖ అమెరికన్ పోర్న్ స్టార్ మియా మాల్కోవా నటించగా.. తాజాగా విడుదలైన జీఎస్టీ ట్రైలర్ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. దీంతో వర్మ చెక్కిన ఈ కళాత్మక నగ్న లఘు చిత్రం చెలరేగతున్న రచ్చ పై చర్చా కార్యక్రమం నిర్వహించిన ఓ టీవీ ఛానల్లో కొంతమంది కాలేజ్ గర్ల్స్ పాల్గొని.. ఆర్జీవీ పై ప్రశ్నల వర్షం కురిపించారు.
ఇక ఆ డిబేట్లో ఒక అమ్మాయి ప్రశ్నిస్తూ.. ఈ చిత్రాన్ని విదేశాల్లో ఎందుకు తీశారు.. పోర్న్‌స్టార్ మియా మాల్కోవాతోనే గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ తాయడానికి గల కారణాలు ఏంటి.. ఇండియాలో ఎవరూ ఈ చిత్రంలో నటించడానికి ఒప్పుకోలేదా.. అని ప్రశ్నించారు. వర్మ బదులిస్తూ.. ఇండియాలో నగ్నంగా నటించడానికి ఎవరూ ఒప్పుకోరు.
ఒక స్త్రీ శరీరం అంటే నాకు ఉన్న అభిప్రాయాలు.. నేను చూసే విధానం కారణంగానే.. ఈ చిత్రానికి ఒక పోర్న్ స్టార్ అయితేనే నేను అనుకున్నది తీయగలననే ఉద్దేశ్యంతో మియా మాల్కోవాను ఎన్నుకోవడం జరిగిందని చెప్పారు. అంతేకాకుండా ఇండియాలో ఇలాంటి సీన్లు తీయడానికి చట్టం ఒప్పుకోదని.. అందుకే యూరఫ్‌లో ఈ ఫిల్మ్ చిత్రీకరించానని రామ్ గోపాల్ వర్మ షాకింగ్ రిప్లై ఇచ్చారు.