అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డ్ట్ ,ప్రస్తుత నవ్యాంధ్ర ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మధ్య ఉన్న తేడాను వైఎస్సార్ తనయుడు ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లాలో నిర్వహిస్తున్న పాదయాత్రలో వివరించారు .పాదయాత్రలో భాగంగా జిల్లాలో బీసీలతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ప్రస్తుత ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం చంద్రగిరి .
అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో 1978లో కాంగ్రెస్ పార్టీ తరపున అక్కడ పోటి చేసి కేవలం రెండు వేల ఐదు వందల ఓట్ల మెజారిటీతో గెలిచారు.దీంతో నాన్నగారి పుణ్యాన మంత్రి అయ్యారు .ఐదేండ్లు పాలించారు మంత్రి హోదాలో .తిరిగి అదే నియోజకవర్గం నుండి 1983లో పోటి చేసి పదిహేడు వేల ఐదు వందల ఓట్ల తేడాతో ఎన్టీఆర్ పార్టీ అభ్యర్ధి చేతిలో ఘోర పరాజయం పొందారు .అయిన కానీ ఎన్టీఆర్ పిలిచి మరి మంత్రి పదవివ్వడమే కాకుండా సొంత కూతుర్ని ఇచ్చి మరి పెళ్లి చేశారు .కొంచెం కూడా కృతజ్ఞత లేకుండా వెన్నుపోటు పొడిచి పార్టీని హస్తగతం చేసుకొని అధికారాన్ని అనుభవించాడు .ఇది చంద్రబాబు నైజం .కానీ నాన్న గారు అలా కాదు ..
తన చిన్నప్పుడు వెంకటప్ప అనే వడ్డెర కులానికి చెందిన గురువు గారింట మూడు ఏండ్లు ఉన్నాడు అనే కారణంతో ఆయన్ని మరిచిపోకుండా నాన్న గారు మరచిపోకుండా వెంకటప్ప మాస్టారు పేరిట పులివెందులలో వెంకటప్ప మెమోరియల్ స్కూలు పెట్టారు. ఇప్పటికి 15 ఏళ్లయింది. వైఎస్సార్ ట్రస్ట్ తరఫున నా భార్య భారతి ఆ స్కూలును గొప్పగా నిర్వహిస్తోందని చెప్పడానికి గర్వపడుతున్నా. 2500 మంది పిల్లలున్నారు. ఇంగ్లిషు మీడియం స్కూలు. యూనిఫారం మొదలు విద్య అంతా ఉచితమే. జిల్లాలో పదో తరగతిలో అత్యధికంగా ఉత్తీర్ణత సాధించిన స్కూలు కూడా అదే. తనను చదివించిన ఓ బీసీ కులానికి చెందిన మాస్టారు పట్ల వైఎస్సార్ చూపిన ప్రేమాభిమానం అది. కానీ చంద్రబాబు మాత్రం తనను ఆదరించిన మామనే వెన్నుపోటు పొడిచాడు. ఇద్దరి మధ్య తేడా ఏమిటో మీరే చూడండి.అని ఆయన వివరించారు ..