Home / SLIDER / యూకే పార్ల‌మెంటులో తెలంగాణ జాగృతి సెమినార్‌…

యూకే పార్ల‌మెంటులో తెలంగాణ జాగృతి సెమినార్‌…

యునైటెడ్ కింగ్‌డ‌మ్ పార్ల‌మెంటులో తెలంగాణ జాగృతి యూకే శాఖ భార‌త దేశ యువ‌త సాధికార‌త మ‌రియు లీడ‌ర్ షిప్ అంశంపై సెమినార్ ను నిర్వ‌హించింది. ఈ స‌ద‌స్సుకు యూకె పార్లమెంట్ సభ్యులు, లండన్ డిప్యూటీ మేయర్, యూత్ చాంపియన్స్, వివిధ విశ్వవిద్యాలయ విద్యార్థులు మరియు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. యూకేతో పాటు మ‌నదేశం లో వివిధ రంగాల్లో యూత్ కోసం ఉన్న‌ అవకాశాలు మరియు సవాళ్లు గురించి చ‌ర్చించారు. అలాగే యూకే భారతదేశం సంబంధాలలో యూత్ పాత్ర ఎలా ఉండాలి అనే అంశంపైనా చ‌ర్చ జ‌రిగింది. సమాజంలోని వివిధ విభాగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న అధికారులు సెమినార్లో మాట్లాడారు. యూకే పార్ల‌మెంటు స‌భ్యులు వీరేంద్ర శర్మ, బాబ్ బ్లాక్మాన్, సీమా మల్హోత్రా, లండన్ డిప్యూటీ మేయర్ రాజేష్ అగర్వాల్, DP సింగ్, ఇండియన్ హై కమిషన్ లండన్ లో కౌన్సిలర్ (పబ్లిక్ డిప్లమసీ) లండన్ లో యువత పాత్ర నుండి వివిధ అంశాలపై మాట్లాడారు.

యుకె- ఇండియా రిలేషన్స్ లో యూత్ పాత్ర‌, బ్రెక్సిట్ – అవకాశాలు & సవాళ్లు అనే అంశంపై చ‌ర్చించారు. ఈ కార్య‌క్ర‌మాన్ని తెలంగాణ జాగృతి సలహాదారు ఉదయ్ నాగరాజు స‌మ‌న్వ‌యం చేశారు. ప్ర‌పంచ వ్యాప్తంగా తెలంగాణ జాగృతి కార్య‌కలాపాల‌ను నాగ‌రాజు వివ‌రించారు. త‌ర‌వాత జాగృతి యూకె అధ్యక్షుడు సుమన్ రావు బ‌ల్మూరి యూకెలో తెలంగాణ జాగృతి నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌మాల‌ను వివరించారు.కొన్నేళ్ల కింద‌ట నిలిపివేయ‌బ‌డిన విద్యార్థులకు పోస్ట్ స్టడీ వర్క్ వీసాను పున‌రుద్ధ‌రించ‌డం ప‌ట్ల ఎంపిలు వీరేంద్ర శర్మ, బాబ్ బ్లాక్మన్, లండన్ డిప్యూటీ మేయర్ రాజేష్ అగర్వాల్ లు త‌మ‌ మ‌ద్ధ‌తు తెలిపారు.

పోస్ట్ స్టడీ వర్క్ వీసా ద్వారా UK విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ తర్వాత 2 సంవత్సరాలు పనిచేయడానికి విద్యార్థులను అనుమతిస్తుందని, ఈ వీసా భారత విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంద‌ని వారు చెప్పారు. తెలంగాణ జాగృతి నైపుణ్య అభివృద్ధి శిక్ష‌ణ కార్యక్రమంను సెమినార్‌లో యూకే ఐటీ టీం ప్రెజెంటేష‌న్ ఇచ్చింది. తెలంగాణ‌లోని 17 పార్ల‌మెంటు నియోజ‌క వ‌ర్గాల్లో ఏర్పాటు చేసిన జాగృతి స్కిల్స్ ట్ర‌యినింగ్ సెంట‌ర్ల ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కు 15080 మంది నిరుద్యోగ యువ‌త‌కు శిక్షణ ఇవ్వ‌గా వారిలో 8494 మంది యువతకు ఉపాధి, ఉద్యోగ అవ‌కాశాలు ల‌భించాయని వివ‌రించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat