జపాన్ పర్యటనలో భాగంగా పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు బృందం రెండోరోజు పలువురు ప్రముఖ పెట్టుబడిదారులు, జపాన్ లోని షిజుఒక రాష్ట్ర పరిపాలనాధికారులను కలిసారు. ఉదయం మంత్రి కే తారకరామారావు సుజుకి మెటార్స్ కార్పోరేషన్ చైర్మన్ ఒసాము సుజికితో సమావేశం అయ్యారు. తెలంగాణ రాష్ర్టం అటోమోబైల్ రంగాన్ని అత్యంత ప్రాధాన్యత రంగా పరిగణిస్తుందని, ఈ రంగంలో రాష్ర్టంలో ఉన్న పెట్టుబడులను మంత్రి సుజుకి చైర్మన్ కు వివరించారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వ పాలసీలు, టియస్ ఐపాస్, సింగిల్ విండో అనుమతుల గురించి తెలిపారు. టియస్ పాస్ విధానానికి సుజుకి ప్రశంసలు కురిపించారు.
షిజుఒకలో ఉన్న సుజుకి మ్యూజియాన్ని మంత్రి బృందం సందర్శించింది. తర్వాత మంత్రి బృందం షిజుఒక రాష్ర్టా గవర్నర్ కవాకాస్తు హైటాతో సమావేశం అయ్యారు. తెలంగాణ రాష్ర్టం, షిజుఒక రాష్ర్టాల మద్య సరస్పర సహాకారం, వ్యాపారానుబంధంపైన చర్చించారు. తెలంగాణ రాష్ర్టంలోని ఉన్న అవకాశాలను పరిశీలించేందుకు షిజుఒక రాష్ర్ట గవర్నర్, ప్రభుత్వ ప్రతినిధులను అహ్వనించారు. షిజుఒక బ్యాంకు ప్రతినిధులతో మంత్రి సమావేశం అయ్యారు.
తెలంగాణ రాష్ర్టంలోని బ్యాంకింగ్, ఫైనాన్సియల్ రంగాల్లో ఉన్న అవకాశాలనను మంత్రి వారికి వివరించారు.ఈ రెండు రంగాల్లోని ప్రపంచ స్ధాయి కంపెనీలు ఇప్పటికే హైదరాబాద్ నగరంలో తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, ఈ రంగంలో సేవలందించేందుకు అవసరం అయిన టాలెంట్ నగరంలో అందుబాటులో ఉందన్నారు. రెండవరోజు పర్యటనలో భాగంగా మంత్రి బృందం సకురాయి లిమిటెడ్ , స్టాన్లీ ఎలక్ర్టిక్ కంపెనీ, ఏయస్ టిఐ కంపెనీలకు చెందిన ప్రతినిధులతో సమావేశం అయ్యారు. అటోమెటివ్ భాగాలను తెలంగాణలో తయారు చేసేందుకు ముందుకు రావాలిన ఎయస్ టిఐ కంపెనీని మంత్రి కోరారు.
Tags cm Governor of Shizuoka kcr ktr Mr. Kawakatsu Heita telangana trs