తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో పార్క్ హయత్ లో జరిగిన ఇండియా టుడే సౌత్ కాన్ క్లేవ్ -2018 సదస్సులో పాల్గొన్నారు .ఈ సదస్సులో ప్రముఖ సీనియర్ జర్నలిస్టు రాజ్ దీప్ సర్ద్ దేశాయ్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు .ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో కానీ ఇంకా ఏ విషయంలో అయిన సరే ఎప్పటికి ఏపీకి పోటి కాదు .మేము అలా అనుకోము .
తెలంగాణను ఏపీలో కలపకముందే అత్యంత ధనిక రాష్ట్రం .హైదరాబాద్ లో అప్పుడే నేటి తరానికి భవిష్యత్తు తరానికి కావలసిన సకల ఆధునిక సదుపాయాలు ఉన్నాయి .నిజాం కాలంలోనే హైదరాబాద్ తో సహా తెలంగాణ అభివృద్ధి చెందింది .కోట్లాడి మరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం అన్ని రంగాల్లో నెంబర్ స్థానంలో ఉంది .హైదరాబాద్ కు గతంలో ఉన్న గార్డెన్ సిటీ అనే పేరు తీసుకురావడమే తమ లక్ష్యం అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా తెలిపారు .