2018 మేడారం సమ్మక్క -సారక్క గిరిజన మహాజాతర పోస్టర్‌ను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. మేడారం జాతరకు రావాలని సీఎం కేసీఆర్‌కు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, రాష్ట్ర గిరిజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ రోజు ప్రగతి భవన్‌లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, రాష్ట్ర గిరిజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరాచందూలాల్ ఆధ్వర్యంలోతెలంగాణ ప్రభుత్వంచే నియమించిబడిన ధర్మకర్తల పాలక మండలి సభ్యులు మరియు మేడారం ఆలయ ట్రస్టు బోర్డ్ ఛైర్మన్ కాకలింగయ్య , పాలక మండలి సభ్యులు సీఎం కేసీఆర్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
నూతనంగా ఎన్నికైన పాలక మండలి సభ్యులను సీఎం కేసీఆర్ అభినందించారు.ఈ సందర్భంగా మంత్రి చందూలాల్ ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్న మేడారం మహా జాతరకు హాజరు కావాల్సిందిగా సీఎం కేసీఆర్‌ను కోరారు. మంత్రి చందూలాల్ మాట్లాడుతూ ఆసియాలో అతి పెద్ద జాతర అయిన మేడారం గిరిజన మహాజాతరకు కోటి మంది భక్తులు విచ్చేసి మొక్కులు తీర్చుకునే అవకాశం ఉంది కాబట్టి అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సీఎం కేసీఆర్ కు వివరించారు. అలాగే మిగిలిన కొద్దిపాటి పనులు ఒకటి ,రెండురోజుల్లో పనులను పూర్తి చేయాలని మంత్రి చందూలాల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.