అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ర్టాల మధ్య ఉన్న కీలకమైన నీటి వివాదాన్ని పరిష్కరించుకునేందుకు తెలంగాణ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ముందడుగు వేయగా….ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు నో చెప్పారు. చర్చల కంటే..రచ్చకు ప్రాధాన్యం ఇచ్చారు.
ఆర్డీఎస్ సమస్య పరిష్కారంపై ఏపీ మంత్రి దేవినేని ఉమకు తెలంగాణ మంత్రి హరీశ్ రావు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ లేఖకు స్పందించిన మంత్రి దేవినేని ఉమ పొరుగు రాష్ట్ర మంత్రి హరీష్ రావుకి లేఖ రాశారు.ఆర్డీఎస్ సమస్య పరిష్కారం సాంకేతిక అంశాలతో ముడిపడి ఉన్న అంశం అంటూ దేవినేని ఉమ తన లేఖలో పేర్కొన్నారు.
మంత్రుల స్థాయి సమావేశం జరగడానికి ముందే ఇరిగేషన్ ఇంజనీర్లు.. అధికారుల స్థాయిలో సమావేశం జరపాలని హరీష్ రావుకు మంత్రి ఉమ సూచించారు. తద్వారా చర్చలకు బ్రేక్ వేశారు.