కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నటించిన 102వ చిత్రం జై సింహా ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. అయితే, అందులో భాగంగా సంక్రాంతి పండుగ రోజున జై సింహా చిత్ర యూనిట్ విజయోత్సవ కార్యక్రమం నిర్వహించింది. కార్యక్రమంలో భాగంగా సినీ హీరో బాలకృష్ణ మాట్టాడుతూ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చెప్పుకొచ్చారు.
సంక్రాంతి పండుగ గురించి మీ అభిప్రాయం ఏంటని యాంకర్ అడిగిన ప్రశ్నకు బాలకృష్ణ మాట్లాడుతూ.. సంక్రాంతి రైతుల పండుగని, ఊళ్లల్లో గాలిపటాలు, అలాగే తన చిన్నప్పుడు పండుగలో బాగంగా సందులు తిరగడం, బాడుగకు సైకిల్ తీసుకుని తొక్కడం, గాలిపటాలు కొనడం, ఎగురవేయడం, భోగిమంటల వెచ్చదనాలు, పిట్టల దొరల మాటలు, అలాగే కొత్త అల్లుళ్ల మర్యాద గురించి చెప్పండి అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు బాలకృష్ణ మాట్లాడుతూ.. అల్లుడంటే గుర్తొచ్చింది.. 1983 సమయంలో నేను షూటింగ్ నిమిత్తం చెన్నైకు వెళ్తూ వస్తుండేవాడిని, బావగారు (చంద్రబాబు) 1983లో మా ఇంట్లోనే ఉండేవారు. అప్పుడప్పుడు మా ఇంటికి వెళ్లే వాడిని… ఆ సమయంలో లోకేష్ నన్ను చూసి ఇంటి గోడను పట్టుకుని నాది అనేవాడు అంటూ చెప్పుకొచ్చాడు బాలకృష్ణ.