ప్రముఖ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మని వార్తల్లో నిలిపిన షార్ట్ ఫిల్మ్ గాడ్ సెక్స్ అండ్ ట్రూత్. ప్రముఖ పోర్న్ స్టార్ మియా మాల్కోవా నటించిన ఈ లఘుచిత్రం ట్రైలర్‌ను ఆర్జీవీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ట్రైలర్ పై ప్రముఖ క్రిటిక్ స్పందిస్తూ.. మియా రూపం, గొంతు, వర్మ్ షాక్ వాల్యూతోపాటు.. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి నేపథ్య సంగీతం ఒక ఎపిక్ విలువను జోడించిందంటూ పోర్న్ స్టార్ మియాను కత్తి పొగిడిన విషయం తెలిసిందే.
అయితే ఈ నేపధ్యంలో జీఎస్టీ పై వివాదాలు జరుగుతుండగా.. తాజాగా పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది. దేశంలో పోర్న్ స్టార్లకు ఉన్నంత గౌరవం సాధారణ మహిళలకు దక్కడం లేదని.. పోర్న్ స్టార్లకు గౌరవంతో పాటు డబ్బు ఎక్కువ మొత్తంలో దక్కుతున్నాయని
పూనమ్ ఆవేదన వ్యక్తం చేశారు.
తమ జీవితంలో ఎదురవుతున్న అనేక సమస్యలను దాటుకుని.. ఏదైనా సాధించాలని ముందుకొచ్చే మహిళలను వేధించడం, అభాండాలకు గురిచేయడం ఈ సమాజంలో పరిపాటిగా మారిందని పేర్కొంది. దీంతో వారు తమ ఆత్మాభిమానాన్ని, మనసును, శరీరాన్ని చంపుకుని బతకాల్సి వస్తోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో పూనమ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.