ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. పాదయాత్ర చేస్తున్న ఆయనకు దారి పొడువునా ప్రజలు తమ సమస్యలు విన్నవించి పరిష్కారం చూపాలని కోరుతున్నారు. జగన్ తో పాటు ప్రజలు పాదయాత్రకు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతూ..ఆయనతో పాటు అడుగులో అడుగు వేస్తున్నారు. కడప ,కర్నూల్ ,అనంతపురం తరువాత 65 రోజులుగా సాగుతున్న ఈ పాదయాత్రలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతున్న జగన్.. చంద్రబాబు పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. పలు కీలక నిర్ణయాలతో ముందుకు దూసుకుపోతున్నారు. ఈ పాదయాత్రలో బాగంగా పాపానాయుడుపేటలో బలహీనవర్గాల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సభలో మాట్లాడిన ప్రతి ఒక్కరి మాటల్లో బాబుగారి మోసాలు బహిర్గతమయ్యాయి. చంద్రబా తన రంగుల మేనిఫెస్టోలో బీసీలకు నాలుగు పేజీలు కేటాయించారు. దాదాపు 120 హామీలను కుమ్మరించారు. అందులో ఏ ఒక్కటీ నెరవేర్చిన పాపాన పోలేదు. కోట్లాదిమంది జనాన్ని నమ్మించి మోసం చేశారు.కనుక వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలో వచ్చాక చట్టసభల్లో బీసీలకు మంచి అవకాశలను కల్పిస్తాం, అంతేగాక చట్టసభల్లో అవకాశాలు కల్పించే వీలులేని బీసీలను నామినేటెడ్ పోస్టుల్లో నియమిస్తాం అని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.
