ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధినేత వైఎస్ జగన్‌తోనే రాజన్న రాజ్యం సాధ్యమని చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే ఆర్కె రోజా అన్నారు. ప్రజా సమస్యలకొసం చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 64వ రోజు నగరి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అశేషజనవాహినిని ఉద్దేశించి రోజా ప్రసంగించారు. ఆమె ఏమన్నారంటే.. జగన్ అన్నా నా 18 సంవత్సరాల రాజకీయ జీవితంలో..నేను ఇద్దరికే రుణ పడి ఉన్నా అన్నా..ఒకటి …నన్ను నమ్మి నగరి ఎమ్మెల్యేను చేసిన జగన్ అన్నకు…జగన్ మాట గౌరవించి నన్ను గెలిపించి ఎమ్మెల్యేను చేసిన నా అభిమాన ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని ఎమ్మెల్యే రోజా అన్నారు. అంతేగాక నా ప్రజల సాక్షిగా చేబుతున్న రాజన్న రాజ్యం వచ్చేంతవరకు జగన్ వేంటనే ఉంటానాని నా నగరి ప్రజల సాక్షిగా ,నా ఆత్మ సాక్షిగా చేబుతున్నాను. 2019లో చంద్రబాబు ఎన్ని కుట్రలు,కుతంత్రాలు చేసిన ఎన్ని అపద్దపు వాగ్దనాలు చేసిన తూర్పున సూర్యడు ఉదయించడం ఏంత నిజమో వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవ్వడం అంతే నిజాము అని రోజా అన్నారు.
