సంక్రాంతి అయిపోయే వరకు కామ్‌గా ఉంటానన్న ప్రముక క్రిటిక్ కత్తి మహేష్.. మరోసారి పీకే ఫ్యాన్స్ పై విరుచుకుపడ్డారు. ఓ ప్రముఖ న్యూస్ చానల్ ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమంలో కత్తి మహేష్, పీకే అభిమానులతో పాటు, జనసేన నేతలతో కూడా పాల్గొన్నారు. ఇక ఈ చర్చలో జనసేన నేత రాజారెడ్డి మాట్లాడుతూ…మహేశ్ కత్తి కథలు చెబుతున్నాడని, పవన్ పై ఆరోపణలు చేసేందుకు తన దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయని ప్రశ్నించారు. దీంతో కత్తి రిప్లై ఇస్తూ.. ఈ ప్రశ్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ అడిగితే చెప్పడానికి తాను సిద్ధంగా ఉన్నానని… తన దగ్గర అన్ని ఆధారాలను ఉన్నాయని.. ఆయన వచ్చి అడిగితే చూపిస్తానని చెప్పారు. ఇక మీరు మాత్రం ఇలాగే మాట్లాడితే.. తాను మళ్లీ పవన్ చర్చల పై కౌంటర్లు ఇవ్వడం ప్రారంభిస్తానని కత్తి మహేష్ అన్నారు. దీంతో సహనం కోల్పోయిన రాజారెడ్డి మాట్లాడుతూ.. పవన్ పై కౌంటర్లు వేయడానికి అసలు నువ్వు ఎవరివయ్యా.. నువ్వు నిజంగానే ఈ గొడవను ఆపాలనుకుంటే ఈ క్షణమే లైవ్‌లో పవన్ కల్యాణ్ ఫొటోని పట్టుకుని.. ఆయన కాళ్లకి దండం పెట్టుకుని స్టూడియో నుంచి వెళ్లిపో అని వ్యాఖ్యానించారు. దీంతో మహేష్ నుండి ఎలాంటి కౌంటర్లు వస్తాయో చూడాలి.
