బాలీవుడ్ హిస్టారికల్ కథలను చెక్కడంతో పేరుగాంచిన దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం పద్మావత్. దీపిక పడుకొనే ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్నా.. వివాదాలు మాత్రం ఆగడం లేదు.. ఇప్పటికే పద్మావత్ వ్యవహారం కోర్టు మెట్లు ఎక్కింది. అయితే ఇప్పుడు ఆ చిత్ర నిర్మాతలు తాజాగా సుప్రీ కోర్టును ఆశ్రయించారు.
అసలు మ్యాటర్‌లోకి వెళితే.. ఎన్నో వివాదాల నడుమ పద్మావతి కాస్త పద్మావత్ గా పేరు మార్చుకొని సెన్సర్ ను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధం అవుతున్న ఈ సినిమాకి తాజాగా మరిన్ని హెచ్చరికలు వస్తున్నాయట. ఇప్పటికే పద్మావత్ చిత్రాన్ని 25న విడుదల కాబోతోంది. కాగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు సినిమా పై నిషేధం విధించాయి.
ఇక ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతలు బుధవారం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సెన్సార్ బోర్డు అనుమతిచ్చాక సినిమాను అడ్డుకునే హక్కు ఏ రాష్ట్రానికీ లేదని తమ సినిమా అన్ని రాష్ట్రాల్లోనూ విడుదలయ్యేలా చూడాలని నిర్మాతలు పిటిషన్ వేశారు. మరోపక్క సినిమాను 25న కాకుండా 24న విడుదల చేయాలని దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఎన్నో వివాదాలు సుడి గుండంలో చిక్కుకున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.