ఏపీలో హాల్ చల్ చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలు..
rameshbabu
January 17, 2018
ANDHRAPRADESH, SLIDER, TELANGANA
1,483 Views
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఫ్లెక్సీ మరోమారు ఏపీలో వెలిసింది. గతంలో పలు పండుగలు, ఇతర సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్లెక్సీలు కనిపించిన సంగతి తెలిసిందే.
తాజాగా సంక్రాంతి పండుగకు సైతం కేసీఆర్ ఫ్లెక్సీ కొలువు దీరింది.తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం ఏడిద గ్రామంలో వెలిసిన ప్లెక్సీ అందరినీ ఆకర్షిస్తోంది.సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ, గ్రామానికి చెందిన అందుకూరి వేంకటేశ్వర్లు, కూరాటి చిన్న దీన్ని ఏర్పాటు చేశారు. ఇందులో కేవలం తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక్కరు మాత్రమే లేరు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిలువెత్తు చిత్రాలను ముద్రించారు.అంతేకాకుండా పైన అంబేద్కర్ చిత్రాన్ని, సరిహద్దుల్లో జవాన్లను, గ్రామంలోని గుడిని ఉంచారు. ఇలా ఏడిద గ్రామంలో ఏర్పాటుచేసిన ఈ ప్లెక్సీ సంక్రాంతికి వచ్చిన వారికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మీడియాలో వైరల్ అయింది.
Post Views: 393