ఏపీలో అప్పుడే సార్వత్రిక ఎన్నికల సమరం మొదలైనట్లు ఉంది.అందుకే పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఇతర పార్టీల వైపు చూస్తున్నారు.ఈ నేపథ్యంలో అప్పటి ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ తరపున మంత్రిగా బాధ్యతలు నిర్వహించి ..రాష్ట్ర విభజన తర్వాత బీజేపీ పార్టీలో చేరిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ సంచలన విషయాన్నీ బయటపెట్టారు.
నిన్న మంగళవారం ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ పార్టీ బలపడుతుంది.అదే సమయంలో ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ గతంలో కంటే ఎక్కువగా ప్రస్తుతం ప్రజాదరణను దక్కించుకుంటుంది.గత రెండు నెలలుగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి వస్తున్న ఆదరణ దీనికి ప్రత్యేక్ష ఉదాహరణ అని ఆయన అన్నారు .
అయితే గత నాలుగు ఏండ్లుగా టీడీపీ చేస్తున్న అవినీతి అక్రమాల కారణంగా ప్రజల్లో ఆదరణ కోల్పోయి తీవ్ర వ్యతిరేకతను కొనితెచ్చుకుంటుంది .గతంలో నన్ను వైసీపీ నేతలు చాలా మంది పార్టీలోకి ఆహ్వానించారు .నేను వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆహ్వానం కోసం వేచి చూస్తున్నాను .అన్ని అనుకున్నట్లు జరిగితే భవిష్యత్తులో వైసీపీలో చేరొచ్చు అని ఆయన వైసీపీ పార్టీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.దీనిపై మీ స్పందన ఏమిటి అని అడిగితే మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ ఇలా సమాధానమిచ్చారు .