టాలీవుడ్ జక్కన్న రాజమౌళికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో ట్రాల్ అవుతోంది. బాహుబలితో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన రాజమౌళికి ప్రస్తుతం గ్రహాలు అనుకూలించడం లేదట. దీంతో ఆయన మంత్రాలయంలోనే కొద్దిరోజులుగా ఉంటున్నారని సమాచారం. తన గ్రహ స్థితి బాలేదని జ్యోతిష్కులు చెప్పగా మంత్రాలయంలో పూజలు చేస్తున్నారట. ప్రస్తుతం గ్రహ పూజలు చేస్తేనే.. ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమా హిట్ అవుతోందని పండితులు సూచించారట. అందుకే పూజలు చేసే పనిలో రాజమౌళి బిజీగా ఉన్నారు..
బాహుబలి చేసిన 5 ఏళ్లు రాజమౌళికి శుక్ర దశ తాండవం చేయడంతో.. జక్కన్న ఆయన పట్టిందల్లా బంగారమైందట. అయితే ప్రస్తుతం శుక్ర మహర్ధశ పోయి గ్రహాల అనుకూలత పోయి అరిష్టం వచ్చిందట. దీంతో ఇప్పుడు ఏదీ చేసినా అపజయమేనట.. అందుకే రాజమౌళి గ్రహాల అనుకూలత కోసం పండితులు చెప్పినట్టు మంత్రాలయంలో రహస్యంగా పూజలు చేస్తున్నారని టాలీవుడ్ వర్గీయుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్త ఎంతవరకు నిజమనేది పూర్తిగా తెలియాల్సి ఉంది.. మరి సోషల్ మీడియాలో ట్రాల్ అవతున్న ఈ మ్యాటర్ పై రాజమౌళి స్పందిస్తారో లేదో చూడాలి.