Home / SLIDER / అనుకున్నది సాధించబోతున్న సీఎం కేసీఆర్ ..

అనుకున్నది సాధించబోతున్న సీఎం కేసీఆర్ ..

తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికినల్లాల ద్వారా ఇంటింటికీ నీరందించే మిషన్ భగీరథ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రాజెక్టును మొత్తం 26 ప్రధాన సెగ్మెంట్లుగా విభజించగా ప్రధాన పనుల్లో 90 శాతం పూర్తయ్యాయి. హైదరాబాద్ మెట్రో వాటర్‌వర్క్స్ (హెచ్‌ఎండీఏ) పైపులైన్ ద్వారా గోదావరి జలాలు (ఎల్లంపల్లి జలాశయం నుంచి) సేకరించి పంపిణీ చేసే జనగామ సెగ్మెంట్‌లో పనులన్నీ పూర్తికాగా, గ్రామాల్లో అంతర్గత పైపులైన్ పనులు కొన్నిచోట్ల మిగిలాయి.

పాలేరు జలాశయం వద్ద నిర్మించిన ఇన్‌టేక్ వెల్ నుంచి మూడురోజుల కిందటే నీటి విడుదల ట్రయల్న్ నిర్వహించారు. అన్నిచోట్ల ప్రధాన పనులు పూర్తి కావస్తుండటంతో నెలాఖరు నాటికి ట్రయల్న్ నిర్వహిస్తామని, అనంతరం బల్క్‌గా గ్రామాలకు నీటిని విడుదల చేస్తామని అధికారులు చెప్తున్నారు. మరో ఆరునెలల్లో ఇంటింటికీ నల్లా కనెక్షన్లను పూర్తిచేస్తామని పేర్కొంటున్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఈఎన్సీ బీ సురేందర్‌రెడ్డి నేతృత్వంలో సీఈ విజయపాల్‌రెడ్డి, ఈఈ విజయ్‌కుమార్ తదితరులు మిషన్ భగీరథ పనులపై క్షేత్రస్థాయి పరిశీలన చేశారు.

ఖమ్మం, జనగామ జిల్లాల్లో ప్రాజెక్టును సందర్శించారు. పాలేరు సెగ్మెంట్‌లో ట్రయల్న్ నిర్వహించడంతో ట్రీట్‌మెంట్ ప్లాంట్ వరకు నీరు చేరింది. ఈ నీటిని ట్యాంకులకు చేర్చి, గ్రామాలకు పంపిణీ చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ట్రయల్న్ విజయవంతమైన ప్రాంతాల్లోని గ్రామాలకు
దశలవారీగా నీరందిస్తామని సురేందర్‌రెడ్డి చెప్పారు.

జనగామ సెగ్మెంట్ ప్రాజెక్టు పరిధిలో 15 మండలాలున్నాయి. వీటిలో జనగామ 11, సిద్దిపేట -3, మహబూబాబాద్-1తోపాటు జనగామ పట్టణం ఉంది. జనగామ సెగ్మెంట్ లో 692 గ్రామాలు ఉండగా, 6,31,057 జనాభా ఉంది. ప్రాజెక్టు కోసం మొత్తం 27 నిర్మాణాలు చేపట్టారు. ప్రధాన పైప్‌లైన్ నిర్మాణం 1,523.33 కిలోమీటర్ల మేర పూర్తయింది. 692 గ్రామాలకు బల్క్‌ గా నీటి సరఫరా జరుగుతున్నది. మొత్తం 1,46,590 కుటుంబాలకు గాను 91,536 కుటుంబాలకు ఇంటింటికీ నల్లా కనెక్షన్ కూడా పూర్తయింది. గ్రామాల్లో 77 శాతం మేర అంతర్గత పైపులైన్ నిర్మాణాలు, 508 ట్యాంకులకుగాను 427 నిర్మాణాలు పూర్తయ్యాయి.

అటు పాలేరు జలాశయంలో ఇన్‌టేక్ వెల్ పూర్తయింది. జీళ్ల చెరువు వద్ద 90 ఎంఎల్డీ సామర్థ్యంతో నీటిశుద్ధి ప్లాంటు నిర్మించారు. ఇన్‌టేక్ వెల్ నుంచి జీళ్ల చెరువు నీటిశుద్ధి ప్లాంటు వరకు ట్రయల్ రన్ విజయవంతమైంది. ఖమ్మం జిల్లాలో ఏడు మండలాలు కూసుమంచి, నేలకొండపల్లి, ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం, రఘునాథపాలెం, చింతకాని, ముదిగొండతోపాటు ఖమ్మం కార్పొరేషన్‌లోని మొత్తం 7.23 లక్షల జనాభాకు దీనివల్ల ప్రయోజనం కలుగనుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat