తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజా సంక్షేమం విషయంలో ఎంతటి చిత్తశుద్ధితో ఉంటారో తెలియజెప్పేందుకు ఇదో ఉదాహరణ. ఏకంగా అధికారులు సైతం ఆశ్చర్యపోయిన పరిస్థితి. సంక్రాంతి సంబరాలతో ప్రజలంతా సందడిగా ఉంటే.. సీఎం కేసీఆర్ వరుస సమావేశాలతో బిజీ అయ్యారు.. సంక్రాంతి రోజున నీటి పారుదలశాఖ అధికారులతో సమావేశమైన సీఎం.. మంగళవారం జిల్లాల కలెక్టర్లతో భేటీ అయ్యారు. సంక్రాంతి రోజున నీటి పారుదల శాఖపై సుదీర్ఘంగా సమావేశం నిర్వహించారు..
ఆ శాఖ మంత్రి హరీష్ రావు, ఇంజనీర్లు, ఉన్నాతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.. ప్రగతి భవన్‌లో జరిగిన ఈ భేటీలో పలు అంశాలపై చర్చించారు ప్రాజెక్టుల పురోగతి, నదుల అనుసంధానంపై ప్రధానంగా చర్చ జరిగింది.. మరోవైపు కావేరీ, గోదావరి నదుల అనుసంధానంపై.. రేపు ఢిల్లీలో వినిపించాల్సిన వాధనలపై.. అధికారులతో సమీక్ష నిర్వహించారు.. కేంద్రం ముందు ఎలాంటి వాధనలు వినిపించాలన్నదానిపై పలు సూచనలు చేశారు..మంగళవారం ఉదయం జిల్లాల కలెక్టర్‌తో సీఎం కేసీఆర్ సమావేశం అయ్యారు..
రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన, పంచాయితీల పునర్ వ్యవస్థీకరణపై చర్చించారు. ఎన్నిలకు సమయం దగ్గర పడుతుండడంతో.. ప్రభుత్వ సంక్షేమ పథకాలపైనా చర్చ జరగనుంది.. అలాగే మిషన్ భగీరథ, ప్రాజెక్టులకు భూ సేకరణ తదితర అంశాలు కూడా ప్రధానంగా చర్చకు వచ్చాయి. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనపై అధికారులకు పలు సూచనలు చేశారు.పండగ పూట సీఎం కేసీఆర్ మరింత జోష్‌తో కనిపిస్తున్నారని…వరుస సమావేశాలతో తమను పరుగులు పెట్టించారని అధికారులు అంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పండగను కూడా పక్కనపెట్టి కీలక అంశాలపై సమీక్షలు నిర్వహించారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.