వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి.. కనుమరోజున చంద్రగిరి నియోజక వర్గం నుండి వైసీపీ ఎమ్మెల్యే రోజా అడ్డా అయిన నగరి నియోజక వర్గంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక సంక్రాతి రోజు రెస్ట్ తీసుకున్న జగన్… పండుగను ప్రజలతో ఘనంగా జరుపుకున్నారు. తమ నాయకుడు పండగ రోజు ఎలా ఉంటాడా అని చూసేందుకు శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్దఎత్తున పారకాల్వ చేరారు అభిమానులు. అందులో మహిళలు పెద్ద సంఖ్యలో విచ్చేసారు. ఫార్మల్ డ్రస్‌తో నిత్యం పాదయాత్రలో కనిపించే జగన్ పండగ స్పెషల్ చూపించారు. పట్టు పంచె, చొక్కా ధరించి అందరికి కనువిందు చేశారు. ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ స్వర్గీయ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించి నూతన వస్త్రాలు అందించారు.
ఇక తిరుపతి నుంచి ప్రత్యేకంగా రప్పించిన పుంగనూరు దూడకు శాస్త్రోక్తంగా పూజలు చేశారు. పశువులకు సంక్రాంతి పండుగకు వున్న అనుబంధానికి గుర్తుగా ఆయన ఈ పూజలు చేసినట్లు వైసీపీ వర్గాలు వెల్లడించాయి. ఏపీ అభివృద్ధి చెందాలని ప్రజలంతా సుఖ సంతోషాలతో వుండాలని మకర సంక్రాంతి పర్వదినాన భగవంతుడిని కోరుకుంటున్నట్లు జగన్ తన సందేశాన్ని మీడియా ద్వారా రాష్ట్ర వాసులకు అందించారు. ప్రజలతో మమేకం అయ్యి సంక్రాంతి పండగ జరుపుకోవడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తన వెంట పాదయాత్రగా వచ్చిన అభిమానులను పేరు పేరునా పలకరించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. జగన్ అధికారంలోకి రావాలని పండగనాడు ఆకాంక్షిస్తున్నట్లు వారు వెల్లడించారు. ఆయన ప్రజా సంకల్ప పాదయాత్ర విజయవంతం కావాలని వారు కోరుకున్నారు. జగన్‌తో పాటు మకర సంక్రాంతి వేడుకల్లో వైఎస్ విజయమ్మ, చెవిరెడ్డి భాస్కర రెడ్డి తదితరులతో పాటు రోజా కూడా స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు.