Home / SLIDER / తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ ….

తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ ….

తెలంగాణ ప్రభుత్వం మ‌రో తీపి క‌బురు అందించేందుకు సిద్ధ‌మైంది.ప్రస్తుతం వెయ్యి రూపాయలుగా ఉన్న ఆసరా పింఛన్‌ను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనిని రానున్న బడ్జెట్ నుంచి రూ. 1500 కు పెంచడానికి ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, కల్లు గీత, బీడీ, చేనేత కార్మికులు, తదితరులకు ప్రతి నెలా ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున ప్రభుత్వం ఆసరా పింఛను ఇస్తోంది. దివ్యాంగులకు మాత్రం రూ. 1500 ల చొప్పున చెల్లిస్తోంది. అయితే అన్ని రకాల పింఛన్లను వచ్చే బడ్జెట్ నుంచి 500 రూపాయల చొప్పున పెంచడంపై ప్రభుత్వం దృష్టిసారిస్తోంది. ప్రతి ఏటా బడ్జెట్‌ లో పింఛన్‌ల కోసం ప్రభుత్వం ప్రస్తుతం 4000 కోట్లు రూపాయలు ఖర్చు చేస్తున్నది. ఇప్పుడు 500 రూపాయల చొప్పున పెంచినట్లయితే సుమారు 2000 కోట్ల మేర అదనపు భారం పడే అవకాశం ఉంది.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నవంబరు నుంచి రాష్ట్రంలో ఆసరా ఫించన్ పథకం అమలవుతోంది.

దీనితో సుమారు 38 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. ఇందులో అత్యధికంగా 13.98 లక్షల మంది వితంతువులు ఉండగా, 13.38 లక్షల మంది వృద్ధులు ఉన్నారు. అటు 4.79 లక్షల మంది దివ్యాంగులు, 4.07 లక్షల మంది బీడీ కార్మికులు, 1.21 లక్షల మంది ఒంటరి మహిళలు లబ్ది పొందుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఎక్కువగా 2.61 లక్షల మంది, జగిత్యాల జిల్లాలో 2.11 లక్షలు, నల్లగొండ జిల్లాలో 1.92 లక్షల మంది , హైదరాబాద్ లో 1.91 లక్షల మంది ఆసరా ఫించన్లు పొందుతున్నారు. కనిష్టంగా కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 50 వేలు, జోగులాంబ గద్వాల జిల్లాలో 68 వేలు, ఆదిలాబాద్ జిల్లాలో 69 వేల చొప్పున లబ్ధిదారులు ఉన్నారు.

సమైక్యరాష్ట్రంలో ప్రభుత్వం పింఛన్ల కోసం 835 కోట్లు మాత్రమే కేటాయిస్తే.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏకంగా ఫించన్ల మొత్తాన్ని నాలుగు రెట్ల కంటే ఎక్కువకు పెంచింది. బడ్జెట్‌లో 4000 కోట్ల రూపాయలు కేటాయించింది. సంక్షేమ పథకాలు ప్రజలపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉన్నందున దీన్ని మరింతగా పెంచడం ద్వారా వాళ్ళకు ఓ భరోసా ఇవ్వొచ్చనేది ప్రభుత్వ అభిప్రాయం. అటు ఒంటరి మహిళలకు తగిన ఉపాధి అవకాశాలు లభించే విధంగా దరఖాస్తు చేసుకున్నట్లయితే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చేది ఎన్నికల సంవత్సరం కావడంతో పింఛన్ల మొత్తాన్ని మరికొంత పెంచే విషయంలో ప్రభుత్వం కొంత సానుకూలంగా ఉన్నది. దీన్ని రానున్న బడ్జెట్ నుంచే అమలులోకి తేవాలని భావిస్తోంది. అటు పింఛనును 500 రూపాయల చొప్పున పెంచినట్లయితే.. లబ్ధిదారులకు ఏ విధంగా ప్రయోజనం కలుగుతుందో, వాళ్ళు ఏ విధంగా సంతృప్తి చెందుతారో ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఓవైపు జిల్లా అధికారుల నుంచీ, మరోవైపు టీఆర్ఎస్ స్థానిక నేతల నుంచి అభిప్రాయాలను సేకరిస్తోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat