ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్రాంతి కానుకగా తనకు మాత్రమే సాధ్యమైన ఉత్తమ డబ్బా జోకు వేసి మరోసారి తానేంటో నిరూపించుకున్నారు. తన స్టేట్‌మెంట్‌తో ఈ సంక్రాంతి సంబరాల్లో తన జోకుదే పైచేయి అని నిరూపించుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్ పితామహుడ్ని తానేనని .. హైదరాబాద్‌ని ప్రపంచపటంలో చేర్చింది కూడా తానేనని పదేపదే డబ్బా కొట్టే బాబు.. తాజాగా సంక్రాంతి పై బీభత్సమైన జోకేశారు. సంక్రాంతి పండుక్కి ప్రజలు తమ సొంతూర్లకు వెళ్ళే సాంప్రదాయాన్ని తామే మొదలుపెట్టామని చంద్రబాబు చెప్పారు. తిరుపతిలో టెక్ హబ్‌ను ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడిన బాబు.. తన భార్య భువనేశ్వరే సంక్రాంతికి సొంతూర్లకు వెళ్లే సంప్రదాయాన్ని మొదలుపెట్టారన్నారు.
ఆమె వల్లే తన సొంతూరు నారావారిపల్లెకు రావడం ఆనవాయితీగా మారిందని చెప్పారు. తమ కుటుంబాన్ని స్పూర్తిగా తీసుకుని తెలుగువారంతా సొంత గ్రామాలకు వెళుతున్నార.. చంద్రబాబు వ్యాఖ్యానించడంతో.. అదే మ్యాటర్ పత్రికల్లోనూ రావడంతో సోషల్ మీడియాలో యధావిధిగా వైరల్ అవుతోంది. హైదరాబాద్‌ను ప్రపంచంలో చేర్చడం, 2019లో అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తామనడం, ఐటీని కనిపెట్టడం, సెల్‌ఫోన్లు కనిపెట్టడం, టీడీపీ వల్లే వెంకటేశ్వరస్వామికి వైభవం వచ్చిందని చెప్పడం, అమెరికాలో ఉన్న తెలుగువారికి ఇంగ్లీష్ నేర్పించడం, పీవీ సింధు మెడల్ గెలవడం వంటి అద్బుతాలు జరగడానికి కారంణం తానేనని చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు సంక్రాంతి పండుగకు గుర్తింపు తెచ్చారన్న మాట అంటూ నెటిజన్లు జోకులేస్తున్నారు. సంక్రాంతికి మంచి జోకుతో నవ్వించినందుకు.. సీఎంకు ధన్యవాదాలు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.