టాలీవుడ్ స్టార్ హీరో ,ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వియ్యంకుడు ,హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రముఖ దర్శకుడు కే .ఎస్ రవికుమార్ నేతృత్వంలో సంక్రాంతికి వచ్చిన లేటెస్ట్ మూవీ జై సింహా .ఎన్నో అంచనాలతో విడుదలైన మూవీ డిజార్డ్ తో ఇటు బాలయ్య అభిమానులను అటు తెలుగు సినిమా ప్రేక్షకులను నిరాశకు గురిచేసింది.
అయితే ఈ మూవీలో బాలయ్య ఒక సీనులో బోలేరు కారును ఒక్క చేతితో ఎత్తేసన్నివేశం ఉంటుంది .విష్ణు చైతన్య అనే ఒక నెటిజన్ ఈ ఫోటోను ట్విట్టర్ లో ప్రముఖ పారిశ్రామిక వేత్త ,మహేంద్ర అండ్ మహేంద్ర అధినేత ఆనంద్ మహేంద్ర కు ట్వీట్ చేశాడు .దీనికి ఆయన స్పందిస్తూ ఒక నవ్వు నవ్వి బోలేరు కార్లను చెక్ చేయడానికి సర్వీస్ సెంటర్లు అవసరం లేదు.హైడ్రాలిక్ లిప్ట్ లు కూడా వాడనక్కర్లేదు అని సరదాగా ట్వీట్ చేశాడు.ఈ ట్వీట్ పై కొంతమంది నెటిజన్లు బాలయ్య పరువును జాతీయ స్థాయిలో తీసేశాడు అని కామెంట్లు పెడుతున్నారు.