ఉద్యోగం రావాలనో.. పెళ్లికాని అబ్బాయిలు తన జీవితంలోకి మంచి అమ్మాయి భార్యగా రావాలనో, అమ్మాయిలయితే మంచి భర్త రావాలనో, తల్లిదండ్రులైతే తమ పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వాలని దేవుడికి ప్రార్థించేందుకు ఆలయాలకు వెళ్తుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే, పిల్లలు పుట్టాలని ఏ దేవుడికి ప్రార్థించాలి..? అసలు వారు మొక్కుకునేందుకు ఏవైనా ఆలయాలు ఉన్నాయా..? అంటే.. ఆలయం ఉందంటున్నారు ఆధ్యాత్మిక వేత్తలు. ఆలయంలో ఒక్క రోజు నిద్రిస్తే స్ర్తీలు గర్భవతులు కావడమేంటి..? ఇదేదో మూఢనమ్మకమంటే మీరు పొరపాటుబడ్డట్టే.
ఇంతకీ ఆ ఆలయం ఎక్కడ ఉంది..? అక్కడకు వెళ్లిన తరువాత ఏం చేయాలి..? అన్నదేగా మీ డౌట్. అయితే, ఈ సమాచారం మీ కోసమే. మనం చెప్పుకునే ఆలయం హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి జిల్లా భరోల్ ప్రాంతంలో ఉంది. అక్కడ సిన్సా దేవతను అక్కడి మహిళలు ఎక్కువగా పూజిస్తారు. ఆ ఆలయం పరిధిలో ఉన్న కోనేటిలో మూడు మునకలు మునిగిన తరువాత తడి బట్టలతో ఆ ఆలయంలో పిల్లలు పుట్టని మహిళలు నిద్ర చేయాలట. అలా చేస్తే సిన్నా సేదవత మనిషి రూపంలో ఆ మహిళ వద్దకు వచ్చి ఆశీర్వదించి వెళ్తుందని అక్కడి మహిళల నమ్మకం. అంతేకాదు.. నిద్రావస్థలో ఉన్నప్పుడు కలలో జామకాయ వస్తే ఆడశిశువు, బెండకాయ, దొండకాయ వస్తే మగశిశువు పుడుతుందట.
ఆ మూడు కాకుండా బండరాయ వస్తే ఆ కలకన్న మహిళ తల్లి కాలేదట. ఇలా ఒక రోజు గడిచాక ఇంకా ఆ ఆలయంలోనే ఉంటే నిద్ర చేసిన మహిళకు దద్దుర్లు వస్తాయని అక్కడి మహిళల నమ్మకం. ఆ వెంటనే ఆ మహిళ ఆ ఆలయాన్ని విడిచి వెళ్లిపోవాలి. ఇది మూఢనమ్మకం అనుకుంటే పొరపాటే. ఇప్పుడు ఈ ఆలయం హిమాచల్ ప్రదేశ్‌లో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతోంది.