కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి శుక్రవారం గన్ పార్క్ అమరుల స్థూపం వద్ద వచ్చినందుకు అమరుల స్థూపం అపవిత్రం అయిందని టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో అమరుల స్థూపనికి టీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ పాలాభిషేకం చేశారు. రేవంత్ రెడ్డి గన్ పార్క్ లో మీడియా సమావేశం పెట్టినందుకు నిరసనగా గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపాన్ని పాలతో టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలు కడిగారు.
ఈ సందర్భంగా విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఏ ఒక్క నాడు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి మొసలి కన్నీరు కారుస్తున్నాడని మండిపడ్డారు. `రేవంత్ రెడ్డి ఉద్యమంలో పాల్గొనలేదు. నిన్న మా అమరుల ఆత్మ గోషించింది మా స్థూపాన్ని అపవిత్రం చేశారు.` అని మా కలలో అమరవీరులు చెప్పారని వెల్లడించారు. అందుకే పాలాభిషేకం చేస్తున్నామని వెల్లడించారు.
గత ప్రభుత్వాలు తెలంగాణ విస్మరించాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ లో ఉంటూ కాంగ్రెస్ ని దూషించిన మణిశంకర్ను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సస్పెండ్ చేశారని గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అదే రీతిలో మంత్రులను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న రేవంత్ ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రేవంత్ తన ప్రవర్తన మార్చుకోవాలని లేదంటే…. భవిష్యత్తులో ఖచ్చితంగా రేవంత్ ని అడ్డుకుంటామని ప్రకటించారు.
Tags cmo congress gun park revanth reddy telangana trs