తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తనయుడు ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ఒకవైపు అధికారక కార్యక్రమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు తన దృష్టికి వచ్చిన సామాన్యుల కష్టాలను తీర్చడంలో ముందుంటారు.నిత్యం ఎన్నో అధికారక సమీక్ష సమావేశాలతో తీరకలేకుండా ఉన్న కానీ సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్ లో అందరికి అందుబాటులో ఉంటారు మంత్రి కేటీఆర్ .తాజాగా ప్రపంచాన్ని జయించే ఆత్మవిశ్వాసం ముందు అంగవైకల్యం కూడా ఓడిపోయింది.తనకున్న పట్టుదలకు కటిక పేదరికం కూడా అడ్డు రాలేదు.అసలు విషయానికి వస్తే రాష్ట్రంలో సిరిసిల్లా జిల్లాలో ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామానికి చెందిన దళిత యువకుడు పిట్ల నర్సింహులుకు సిరిసిల్ల లో ఒక ప్రయివేట్ కళాశాలలో ఉద్యోగం ఇప్పించాడు మంత్రి కేటీఆర్ ..
అయితే పీజీ అయిపోయి ..మరోవైపు వయసైపోయిన అమ్మానాన్నలు, పెండ్లీడుకొచ్చిన నలుగురు చెల్లెండ్లను పోషించేందుకు ఉద్యోగ ప్రయత్నాలు ముమ్మరం చేశాడు నర్సింహులు.ఆ క్రమంలో తన గ్రామాన్ని దత్తత తీసుకొన్న మంత్రి కేటీఆర్ ను కల్సి తన గోడును వివరించి ..కనీసం అటెండర్ ఉద్యోగాన్ని అయిన సరే ఇప్పించాలని కోరాడు .అందులో భాగంగా మంత్రి కేటీఆర్ ఉద్యోగాన్ని పెట్టించి మంచిగా చదువుకోవాలని సూచించారు .ఆ క్రమంలో ముస్తాబాద్‌లోని వెన్నెల జూనియర్ కళాశాల కరస్పాండెంట్ ప్రకాశ్ అందించిన ప్రోత్సాహంతో నర్సింహులు అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత పరీక్ష పాసై జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కూడా సాధించారు.
నర్సింహులు సాధించిన విజయాన్ని తెలుసుకున్న మంత్రి కేటీఆర్, వివేకానంద జయంతి, జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆయనను తన కార్యాలయానికి పిలిపించుకుని సన్మానించారు. అంగవైకల్యాన్ని ఆత్మవిశ్వాసంతో జయించిన నర్సింహులు గెలుపు తనలాంటివారికి స్ఫూర్తినిస్తుందని చెప్పారు. యువజన దినోత్సవం జరుపుకుంటున్న యువతకు నర్సింహులు రియల్ ఇన్‌స్పిరేషన్ అని పేర్కొన్నారు. రూ.2 లక్షల ఆర్థికసాయం అందించారు. పూరిగుడిసెలో ఉంటున్న యువకుడి కుటుంబానికి డబుల్ బెడ్‌రూం ఇల్లు నిర్మించి ఇస్తామని భరోసా ఇచ్చారు. వచ్చే దసరానాటికి కొత్త ఇంట్లో భోజనం చేస్తానని అతడికి మాటిచ్చారు. నర్సింహులు లాంటి ఎందరో యువకులు మనచుట్టూనే ఉంటారని, అలాంటివాళ్లను ప్రోత్సహిస్తే అద్భుతాలు సాధ్యమవుతాయని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు.