ఏపీ ప్రధాన ప్రతి పక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మకర సంక్రాంతిను పురష్కరించుకొని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసారు.ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ సొంత గ్రామాలతో ప్రజలకు ఉన్న చెక్కు చెదరని ఆత్మీయతలు, అనుబంధాలకు ప్రతీక సంక్రాంతి అని అన్నారు.
ఈ పండగ అంటేనే రైతులు, పల్లెలు, భోగి మంటలు, రంగవల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్ళు, పైరు పచ్చల కళకళలు ప్రతి ఒక్కరికి గుర్తుకురావడం సహజమని ఆయన అన్నారు.అన్నపూర్ణగా పేరుగాంచిన తెలుగునేల మీద రైతన్నలు, గ్రామీణ వృత్తుల వారు, సుఖసంతోషాలతో తులతూగాలని, పంటలు బాగా పండి రైతులతో పాటు, ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని తన సందేశంలో ఆయన ఆకాంక్షించారు.