తెలంగాణ రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తొర్రూర్ మండల కేంద్రంలోని పెద్ద చెరువు, గుర్తూర్ రామసముద్రం చెరువుల సామర్థ్యాన్ని పెంచి మినీ ట్యాంక్ బండ్‌గా అభివృద్ధి పరిచేందుకు నిధులు కేటాయించాలని పాలకుర్తి అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు.. మంత్రి హరీశ్ రావుకు వినతిపత్రం అందజేశారు.