ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత సంవత్సరం జరిగిన నంద్యాల ఉప ఎన్నిక ఫలితమో ఏమోగానీ.. ఓటర్లను కొనేయడం ఈజీ అనే భావనకు వచ్చేశారు టీడీపీ నేతలు. ఈ మాటలు ఎవరో అంటున్నవి కాదండి బాబోయ్.. ఏకంగా టీడీపీ మంత్రులే అంటున్న మాటలివి.
ఇంతకీ ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఏమన్నారేగా మీ డౌట్. అయితే, ఈ మద్యన చంద్రబాబు సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నామంటూ చేపట్టిన జన్మభూమి కార్యక్రమం కడప జిల్లా రాయచోటిలో జరిగిన విషయం తెలిసిందే.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డిలు ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. ఐదేళ్లకోసాని జనం వద్దకు వస్తామని చెప్పారు. ఎన్నికలు రేపు ఉన్నాయనగా.. ముందు రాత్రి వచ్చి ఓటర్ల చేతులు తడిపేస్తామని, ఆ తరువాత మళ్లీ ఐదేళ్లకు వాళ్లకు కనిపిస్తామని బహిరంగ వ్యాఖ్యలు చేశారు. ఇలా ఒక మంత్రి స్థాయిలో ఉండి చేతులు తడిపేస్తామంటూ ఓటర్లనుద్దేశించి అనడంతో దిగ్ర్భాంతి చెందడం అక్కడి ప్రజల వంతైంది.