తెలంగాణ రాష్ట్ర మాజీ సీనియర్ మంత్రి ,సీఎల్పీ నేత జానారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత నియోజక వర్గం నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజక వర్గంలో ఆ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తలిగింది .నియోజక వర్గంలో నిడమనూర్ మండలంలో ఎర్రబెల్లి ఎంపీటీసీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఘనవిజయం సాధించారు .
అయితే అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తన సమీప టీడీపీ పార్టీకి చెందిన అభ్యర్థిపై ఐదు వందల అరవై మూడు ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.అయితే రానున్న ఎన్నికల్లో అధికారంలోకి రావాలని కలలు కంటున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోనే అత్యంత సీనియర్ మాజీ మంత్రి ,సీఎల్పీ నేత ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గంలో గెలవలేకపోవడం ఆ పార్టీ పతనానికి నిదర్శనం అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి .
మరోవైపు మునుగోడు మండలం కిస్టాపురం ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఐదు వందల ఇరవై ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.ఇటివల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో గెలుపొంది కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తర్డ్ ప్లేస్ లో ఉండటం ఆ పార్టీ పతనానికి నిదర్శనం ..