ఏపీలో టీడీపీ నేతల పాలన గురించి దేశ వ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. ప్రజాసమస్యలు పరిష్కరించడం కోసం అంటూ నిర్వహిస్తున్న జన్మభూమి కార్యక్రమంలో టిడిపి నేతలు, అధికారులు డ్యాన్సులు వేయడం ఏమిటని చిత్తూరు జిల్లా నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. జన్మభూమిలో డ్యాన్సులకు సంబంధించిన వీడియోను ఫేస్‌బుక్ అకౌంట్లో పోస్ట్ చేసి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “వందల కోట్లు ఖర్చుపెట్టి ప్రభుత్వం జన్మభూమి కార్యక్రమాలు నిర్వహిస్తోంది…ప్రజల సమస్యలు తెలుసుకోడానికా లేక డ్యాన్సులు వేసుకోడానికా?” అని రోజా ఘాటుగా ప్రశ్నించారు. జన్మభూమి కార్యక్రమంలో డ్యాన్సులకు సంబంధించి రెండు పోస్ట్ లు చేసిన రోజా వైసిపి అధినేత జగన్ కోసం ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాద యాత్ర చేస్తుంటే టిడిపి నేతలు జన్మభూమి కార్యక్రమంలో గున్నా గున్నా మామిడి వంటి పాటలు పెట్టుకొని డ్యాన్సులు చేస్తున్నారని, దీన్ని బట్టి ఎవరు ప్రజల పక్షమో మీరే నిర్ణయించండి అని ప్రశ్నించారు. ఫేస్ బుక్ లో రోజా పెట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
ఎవరు ప్రజాపక్షం మీరే నిర్ణయించండి !
ఎవరు ప్రజాపక్షం మీరే నిర్ణయించండి !
Posted by Gudivada Kodalinani on Thursday, 11 January 2018