తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీ రామారావుతో హైదరాబాద్ లో బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ సమావేశమయ్యారు. తెలంగాణ, యునైటెడ్ కింగ్ డమ్ మధ్య వాణిజ్య అభివృద్ధి, తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు.
అలాగే, వచ్చే నెలలో బ్రిటన్ నుంచి హెల్త్, క్రియేటివ్, లైఫ్ సైన్సెస్ రంగాలకు చెందిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం హైదరాబాద్ రానున్నట్టు ఆండ్రూ మంత్రి కేటీఆర్ కు తెలిపారు.హైదరాబాద్ బేగంపేటలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు సానుకూల వాతావరణం ఉందన్నారు. తమ పారిశ్రామిక విధానం అయిన టీఎస్ఐపాస్ ప్రపంచవ్యాప్త గుర్తింపును దక్కించుకుందన్నారు మంత్రి కేటీఆర్