Home / SLIDER / ములుగు ఘన్పూర్ గ్రావిటీ కెనాల్ కు రెండు రోజుల్లో టెండర్లు…

ములుగు ఘన్పూర్ గ్రావిటీ కెనాల్ కు రెండు రోజుల్లో టెండర్లు…

దేవాదుల ప్రాజెక్టు పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. గురువారం రాత్రి బాగా పొద్దు పోయేవరకు దేవాదుల పనులను ఆయన సమీక్షించారు.ముఖ్యంగా దేవాదుల 3 వ ఫెజ్ కు చెందిన ప్యాకేజి 2,3,4 ల పురోగతిని మైక్రో లెవల్ లో సమీక్షించారు.ప్యాకేజి 2 పనులను వచ్చే జూలై నాటికి పూర్తి చేయాలని, ప్యాకేజి 3 ను అక్టోబర్ కల్లా పూర్తి చేయాలని మంత్రి డెడ్ లైన్ విధించారు. ఒప్పందం ప్రకారం నిర్ణీత గడువు లోపు పనులు చేయని ఏజెన్సీ లను తప్పించి వేరే వారికి పనులప్పగించాలని అధికారులను ఆదేశించారు. ప్యాకేజి 2 పనులలో పురోగతి ఆశాజనకంగా ఉన్నందున త్వరితగతిన పూర్తి చేస్తే రామప్ప కు నీళ్ళందు తాయని అక్కడి నుంచి ములుగు, ఘన పూర్,భూపాలపల్లి,పాకాల,ఎర్ర రంగయ్య చెరువులకు,ఆయా ప్రాంతాల ఆయకట్టుకు నీరందిస్తామని హరీశ్ రావు అన్నారు. ఈ ప్యాకేజి తో త్వరితగతిన ఫలితం వస్తుందన్నారు.జూలై చివరికల్లా వెట్ రన్ నడపాలని ఆదేశించారు. మే చివరికల్లా అవసరమైన మోటార్లు, పంపులు సమకూర్చుకోవాలని ఏజెన్సీ లను కోరారు. ఫ్లడ్ లైట్లు పెట్టుకొని మూడు షిఫ్టులు పని చేయాలని మంత్రి సూచించారు.

భూసేకరణ, సివిల్,మెకానికల్, టన్నెల్ తవ్వకాలు, లైనింగ్ పనులు ఏక కాలంలో సాగాలని కోరారు. పదిహేను రోజుల కోసారి దేవాదుల పనులను సమీక్షించి తనకు నివేదిక ఇవ్వాలని తెలంగాణ లిఫ్ట్ పథకాల సలహాదారు పెంటారెడ్డి ని మంత్రి సూచించారు. వచ్చే ఏప్రిల్ చివరికి విద్యుత్ సబ్ స్టేషన్లు, టవర్ల నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని హరీశ్ రావు కోరారు.పకడ్బందీ కార్యాచరణ ప్రణాళికతో,టార్గెట్ ప్రకారం పని చేయాలని ఆదేశించారు.ములుగు ఘన్పూర్ గ్రావిటీ కెనాల్ కు రెండు రోజుల్లో టెండర్లు పిలవాలని కోరారు. ఇందుకు కావల్సిన భూసేకరణ ప్రక్రియను వెంటనే ముగించాలన్నారు.ప్యాకేజి 2,3 ల పంపు హౌజ్ ల పనులను నిరంతరం పర్యవేక్షించే బాధ్యతను పెంటారెడ్డికి మంత్రి అప్పగించారు.ప్యాకేజి 5 లో ధర్మసాగర్ నుంచి తపాసుపల్లి కి నీరందించే పథకాన్ని మంత్రి హరీశ్ రావు సమీక్షించారు.ధర్మసాగర్ టన్నెల్ లైనింగ్ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.

రామప్ప నుంచి ఎర్ర రంగయ్య చెరువుకు నీటిని అందించగలిగితే నల్లబెల్లి మండలంలో 10 గొలుసు కట్టు చెరువులు నింపవచ్చునని ఆయన తెలిపారు. ప్యాకేజి 6 లో భాగంగా చేపట్టిన చెన్నూరు, ఉప్పుగల్లు, పాలకుర్తి రిజర్వాయర్ ల పనులు నత్తనడకన సాగుతుండటం పట్ల మంత్రి హరీశ్ రావు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.పదిహేను రోజుల్లో పనుల పురోగతి లేకుంటే ఏజెన్సీని మార్చేందుకు నిర్ణయం తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.దేవాదుల మొదటి దశ కింద 1,22,700 ఎకరాలకు సాగునీటి సరఫరా జరుగుతున్నదని మంత్రి తెలిపారు. రెండో దశలో ఆర్.ఎస్.ఘనపూర్,4L, తపాసుపల్లి, అశ్వరావుపల్లి, చిట్ట కోడూరు ప్రధాన కాలువల పనులు పురోగతి లో ఉన్నాయని చెప్పారు. మూడో దశ కింద ప్యాకేజి 1 పంపు హౌజ్,పైపులైన్ పనులూ రెండేళ్ల క్రితం పూర్తయినట్టు హరీశ్ రావు తెలిపారు.మిగిలిన 7 ప్యాకేజి ల పనులు వివిధ దశలలో ఉన్నాయని వాటిని సత్వరం పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ సమీక్ష లో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎం.పిలు పసునూరి దయాకర్, సీతారాం నాయక్, ఎం.ఎల్.ఏ.ఆరూరి రమేష్,సి.ఈ.లు శంకర్, బంగారయ్య,ఎస్.ఇలు చిట్టీరావు, శ్రీనివాస్ రెడ్డి,వివిధ ఏజెన్సీ ల ప్రతినిధులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat