డోర్నకల్ నియోజకవర్గంలో రాష్ట్ర భారీ నీటిపారుదల, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి తన్నీరు హరీశ్ రావు కీలక ప్రసంగం చేశారు. “మీరంతా కలిసి ఉంటే కాంగ్రెస్ గాలిలో కొట్టుకుపోతుంది. టీఆరెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో,సమిష్టిగా పని చేయాలి.ఐకమత్యం అవసరం.అందరూ కలిసి పని చేయాలి. ఇదే స్ఫూర్తి ఇకముందుకూడాకొనసాగించాలి.నాకెలాంటి అనుమానం లేదు. డోర్నకల్ నియోజకవర్గంలో లక్ష మెజారిటీ మనకొస్తుంది` అని మంత్రి హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు.
`కాళేశ్వరం పూర్తి కాక ముందే ఎసారెస్పీ స్టేజ్1, స్టేజ్2 పనులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ రెండు దశలలో 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.440 కోట్లతో కాకతీయ ప్రధాన కాలువనుఆధునీకరిస్తున్నాం.వచ్చే వానాకాలం నాటికి కాళేశ్వరం నుంచి నీరు పారిస్తాము. కాంగ్రెస్ హయాంలో ఎపుడూ ఎసారెస్పీని పట్టించుకోలేదు. మేడిగడ్డ దగ్గర 300 రోజులు నీళ్ల నిల్వ ఉంటాయి.కాళేశ్వరం లో ఒక రోజుకు 2 లక్షల సిమెంట్ బస్తాలు వాడుతున్నాం.ఇలాంటి భారీ ప్రాజెక్టు, ఇంత వేగంగా పనులు జరిగే ప్రాజెక్టు మరొకటి తాము చూడలేదని కేంద్ర జలసంఘం ప్రతినిధులు స్వయంగా కాళేశ్వరం పనులను చూసి ఆశ్చర్య పోయారు.` అని మంత్రి వివరించారు.
`తెలంగాణ వస్తే కటికచీకటి అని కాంగ్రెస్ సి.ఎం. కిరణ్ అన్నాడు.ఆయన మాటలను తెలంగాణ సీఎం కేసీఆర్ తునాతునకలు చేశారు.కాంగ్రెస్ హయాంలో 6 గంటలే కరెంటు వచ్చింది. ఇప్పుడు నాణ్యత కల కరెంటు 24 గంటలు ఉచితంగా ఇస్తున్నాం. కాంగ్రెస్ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్నికల సమయంలో ప్రాణహిత- చేవెళ్ల కు కొబ్బరి కాయకొట్టారు. అటవీ, పర్యావరణ అనుమతులు లేవు. అంతర్రాష్ట్ర అనుమతి లేదు. ఎలాంటి అనుమతులు లేవు. పనులుజరగలేదు కానీ, మోబిలైజేషన్ నిధులు జేబుల్లో వెళ్లాయి. తండాలను వచ్చే నెలలో గ్రామ పంచాయతీ లుగా మార్చుతున్నాం. గతంలో చాలా సార్లు కాంగ్రెస్ నాయకులు హామీలను ఇచ్చినా అమలు చేయలేదు.` కానీ టీఆర్ఎస్ పార్టీ ఇందుకు భిన్నం అని తెలిపారు.
Post Views: 274