తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజల జీవితాల్లో ఈ పండుగ సరికొత్త కాంతులను నింపాలని ..అన్ని వర్గాల ప్రజలు సకల సుఖసంతోషాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు .అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ భూముల్లో బంగారు పంటలు పండటానికి చేస్తున్న ప్రయత్నాలు అన్ని సఫలం కావాలని ..రైతన్నలతో పాటు అన్ని వర్గాలు ఆనందంగా ఉండాలని ఆ భగవంతుడ్ని కోరారు ..