తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ సర్కారు రాష్ట్రంలోని దివ్యాంగుల కోసం నూతన సంవత్సర కానుకను ప్రకటించింది.గత నాలుగు ఏండ్లుగా దివ్యంగుల కోసం సర్కారు పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుంది.అందులో భాగంగా దివ్యాంగులను సకలాంగులు వివాహం చేసుకుంటే ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం పెంపు ఫైల్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు.
గతంలో ప్రభుత్వాలు నెలకు కేవలం ఐదు వందలు పెన్షన్ ఇచ్చి చేతులు దులుపుకుంది.కానీ టీఆర్ఎస్ సర్కారు దాన్ని రూ.పదిహేను వందలకు పెంచింది.అంతే కాకుండా వారికోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంది సర్కారు .ఉపకార వేతనాలను అందజేస్తుంది కూడా .తాజాగా వివాహ ప్రోత్సాహం కింద అందజేస్తున్న యాబై వేల రూపాయల నుని లక్షకు పెంచడమే కాకుండా కళ్యాణ లక్ష్మీ ,షాదీ ముబారక్ పథకాలను అందిస్తుంది .దీనిపై దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తోన్నారు .