బీకాంలో మ్యాథ్స్, ఫిజిక్స్ ఉంటుందంటూ ఇటీవలో ఓ ఇంటర్వ్యూలో వింతగా వాదించిన వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తాజాగా వైకాపా అదినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విరుచుకుపడ్డాడు. కాగా.. ఇటీవల ఓ సమావేశంలో ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పాదయాత్ర చేస్తాడట. పాదయాత్ర ఎవరు చేస్తారండీ.. అనుభం ఉన్నవాళ్లు.. దేశ స్వాతంత్ర్యం కోసం సమరయోధులు చేస్తారని, ఓనమాలు రాజకీయాలు కూడా తెలియని నీవు ఏ మొఖంపెట్టుకుని పాదయాత్ర చేస్తావని వైఎస్ జగన్‌ను ప్రశ్నించారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తలతో నడుస్తానన్నా తన పాదయాత్రకు ఊపురాదన్నారు. అలా ఊపురావాలంటే ఒక్క చంద్రబాబుకే సొంతమన్నారు. పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉన్నా కూడా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన చంద్రబాబుదేనన్నారు వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్.
