తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ అర్బన్ జిల్లా 44వ డివిజన్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ గెలిచింది.సుమారు 830 ఓట్ల మోజార్టీతో బీజేపీ అభ్యర్థి సంతోష్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అనిశెట్టి సరిత గెలిచింది. 44వ డివిజన్‌లో టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన అనిశెట్టి మురళి మనోహర్ ఆరు నెలల క్రితం హత్యకు గురైన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో అక్కడ కార్పోరేటర్ స్థానం ఖాళీ అయ్యింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసింది. చనిపోయిన మురళి కుటుంబానికి బాసటగా నిలవాలనే ఉద్యేశ్యంతో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థన మేరకు కాంగ్రెస్ పార్టీ ఈఎన్నికలో పోటీ చేయలేదు. టీడీపీ, వెఎస్సార్సీపీలు సైతం టీఆర్‌ఎస్ అభ్యర్థికి మద్దతుగా బరి నుంచి తప్పుకున్నాయి. స్వతంత్ర అభ్యర్థులు కూడా తప్పుకున్నారు.