సంక్రాంతి అంటేనే సరదా..సిరులు తెచ్చే భోగి భాగ్యాల పండుగ .పల్లె పడుచుధనాన్ని సంక్రాంతి పండుగ శోభలోనే చూడాలి.భోగి కొత్త ధనాన్ని ఆహ్వానిస్తే.. పాడి పంటల సౌభాగ్యాన్ని సంక్రాంతి ఇస్తుంది.రంగుల రంగవల్లికల అల్లికలు పట్టు పరికిణీల్లో పండుగ అందాలు కొత్త అల్లుళ్ళు ,కొత్త బట్టలు..ప్రతీ సన్నివేశంలో కొత్త దానం కనిపించే పండుగ సంక్రాంతి.ఇది రైతుల పండుగ .పుడమి సంబరం .ఉత్తరాయణ పుణ్యకాల సమయంలో వచ్చే ఈ పండుగ సకల శుభాల వేదిక. ఏరువాక మోసుకొచ్చిన కొత్తధాన్యాలతో ప్రతి ఇల్లు సుఖసంతోషాలతో కళకళ్లాడే వేళ ఇది.
అందుకు కృతజ్ఞతగా కొత్తకుండలో … పాలూ,కొత్త బియ్యం.. వేసి పొంగించి మా కుటుంబాన్ని కూడా ఇలా పాలపొంగులా సంతోషాలతో నింపమని సూర్యభగవానున్ని కోరతారు ఇంటిల్లిపాది. కాస్త కారం.. కాస్త తీపి కలిసిన రుచులే అక్కడా వండుతారు. పాలు, నువ్వులు, బెల్లం, కొబ్బరితో పాటూ శరీరాన్ని మనసుని దృఢంగా ఉంచే సంప్రదాయక రుచులు వండే వేళ ఇది. అరిసెలు, జంతికలు, పాకుండలు, కజ్జికాయలు, సకినాలు, అప్పాలు ఇలా బోలెడు చాలా రకాలే చేస్తాం. అందులో సంక్రాంతికి ఎక్కువగా చేసే పిడివంటకాల పేర్లు మీ కోసం.
పెసర జంతికలు
కారం సకినాలు
నువ్వుల బూరెలు
రేగి వడియాలు
పాల అరిసెలు
గారెలు
పప్పు చక్రాలు
ఖజికాయలు
రిబ్బం మురికలు
బెల్లం లడ్డు
కారాబొంది
గవ్వలు
కొబ్బరి బూరెలు
గోర్మీటి తీపి
గులాబీ రేకులు
చేకోడిలు
మురుకులు