సామాన్యంగా పండుగులకు అందరూ ఒక్కచోటుకి చేరి జరుపుకోవడం అలవాటు.కాని ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ నాడు తప్పని సరిగా ప్రతి ఒక్కరు తమ ఇంటికి వెళ్లి కుటుంబం తో ఎంతో సంతోషంగా జరుపుకుంటారు.అయితే ఇక్కడ చెప్పుకోవలిసిన విషయం ఏమిటంటే పేదవారైన , గొప్పింటి వారైనా అత్తవారింటికి వెళ్ళిపోయిన కూతుళ్ళను ఇంటికి ఆహ్వానిస్తారు.సంక్రాంతి పండుగ సమయానికి ప్రతీ రైతు చేతి నిండా డబ్బు తో ఇంటి నిండా ధాన్యంతో కళకళలాడుతూ ఉంటాడు.అలాంటి సమయంలోనే ఈ పండుగ వస్తుంది.కావున ఈ పండుగ ను ఘనంగా జరుపుకుంటారు.
ఇంటి ఆడపడుచు కనుమ రోజు ఉదయాన్నే స్థానం చేసి ఎక్కువ అన్నం వండి,ఉత్త తెల్ల అన్నం కాకుండా పులిహోర లాంటిది ఏదైనా అన్నం వండి పెద్ద పెద్ద ముద్దలుగా చేసి..ఇంటి బయట లేదా ఉరి బయట లేదా పోలంగట్ల పైన లేదా చెరువు గట్ల పైన పెట్టి వస్తారు.వాటిని ప్రాణులు అంటే పక్షులు ముగాజీవాలు వచ్చి తింటాయి . అంటే పితృ దేవతలు పక్షి రూపంలో వచ్చి తిని వెల్లుతారని ఒక నమ్మకం.ఇలా చేసి ఇంటికి వెళ్ళిన ఆడపడుచులు స్థానం చేస్తారట.ఆ అమ్మాయి యొక్క అన్నదమ్ములు తమ ఇంటి సుఖం కోసం అలా చేసింది కాబట్టి ఆమెకి కొత్త బట్టలు పెట్టి సన్మానం చేస్తారట.ఆమెను సంతోష పెడతారట .ఈ సంప్రదాయం ఎంతో ప్రాచీనమైనది.తమిళనాడులో ఎక్కువగా ప్రాచుర్యం పొందినది.మనదగ్గర కుడా దీనిని ఎక్కువగా పాటిస్తూ వున్నారు. ఈ సంవత్సరం మీరు కూడా ఈ పక్రియను చేసి మీ జీవితాన్ని సులభం చేసుకోండి.