టాలీవుడ్‌లో వాళ్లతో సినిమాలు చేస్తే కోట్లకుపై చిలుకు లాభాలు వస్తాయి. లెక్కలేని అభిమానుల సంఖ్య వారి సొంతం. కాబట్టి వారితో ఒక్క సినిమా తీస్తే చాలు నిర్మాతకు కాసులపంట పండినట్లే. అప్పటి వరకు ఎన్ని సినిమాలు చేసినా.. ఎన్ని నష్టాలు వచ్చినా వాళ్లతో ఒక్క సినిమా చేస్తే చాలు డబ్బులే.. డబ్బులు అని అనుకునే పరిస్థితి నిర్మాతలది. అలా అనుకునే ఇప్పుడు బొక్కా బోర్లా పడుతున్నారు. ఇంతకీ ఆ హీరోలు ఎవరనేగా మీ డౌట్.. వారే మెగా హీరోలని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇప్పుడు అలా బొక్కాబోర్లా పడిన నిర్మాతల్లో రాథాకృష్ణ (చిన్నబాబు) చేరాడట. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను నమ్మి పూర్తిగా బలైపోయాడట. అజ్ఞాతవాసి సినిమాతో పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయి.. ఎవర్ని అడగాలో తెలీక తలగోక్కుంటున్నాడట.
రాఝథాకష్ణకు అజ్ఞాతవాసి చిత్రంతో కోలుకోలేని దెబ్బ తగిలిందట. అయితే, పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో అత్తారంటికి చిత్రం తర్వాత వచ్చిన అజ్ఞాతవాసి మూవీ పవర్ స్టార్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచిన విషయం తెలిసిందే. అజ్ఞాతవాసి అత్తారంటికి సీక్వెల్లా ఉందంటూ థియేటర్‌లో సినిమా రన్నింగ్ అవుతున్నంతసేపూ అభిమానుల చర్చించుకున్నారడంలో అతిశయోక్తి లేదు.
ఇక అసలు విషయానికొస్తే.. ఈ చిత్రం కోసం నిర్మాత చిన్నబాబు ముందుగా అనుకున్నదానికంటే.. భారీగానే ఖర్చుపెట్టాడట. మొదట అజ్ఞాతవాసి చిత్రాన్ని రూ.70 కోట్లలో పూర్తి చేద్దామని అనుకున్నారంట. అయితే, అదీ కాస్తా రూ.115 కోట్లకు చేరింది. దీంతో నిర్మాత చిన్నబాబు దర్శకుడు త్రివిక్రమ్‌పై గుర్రుగా ఉన్నాడట. మరో పక్క పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ తన రెమ్యునరేషన్‌ను రూ.40 కోట్లు తీసుకున్నట్లు సినీ వర్గాల సమాచారం.
అయితే, తెలుగు రాష్ట్రాల్లో పవర్‌స్టార్ మార్కెట్ రూ.100 కోట్లు మాత్రమే కదా..! అజ్ఞాతవాసి కోసం రూ.117 కోట్లు ఖర్చుపెట్టడమేంటీ అంటూ నిర్మాత చిన్నబాబును ఆయన సన్నిహితులు ప్రశ్నిస్తున్నారట. ఇకపోతే విదేశాలలో మీటింగ్.. రిలాక్స్ అంటూ మరో 12 కోట్లను ఖర్చుపెట్టేలా ప్లాన్ చేశాడట త్రివిక్రమ్. దీంతో త్రివిక్రమ్‌పై నిర్మాత చిన్నబాబు తీవ్ర ఆగ్రహావేశంలో ఉన్నాడట. ఇలా మొదట 70 కోట్లే అనుకున్నప్పటికి చివరకు మరో 57 కోట్లు ఖర్చు కావడం.. ఇలా రూ.127కోట్లు మొత్తం ఖర్చుకావడం.. విడుదలైన మొదటి రోజే భారీ డిజాస్టర్ టాక్ రావడంతో నిర్మాత పరిస్థితి మరీ దారుణంగా తయారైందని చర్చించుకుంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.