మిస్టర్ వివాద్ ఫుల్ జీనియస్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి తెర తీశాడు. అయితే ఈసారి ఏకంగా తెల్లపిల్లని రంగంలోకి దించాడు వర్మ. అమెరికాకు చెందిన పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో ఒక షార్ట్ ఫిల్మ్‌ను రూపొందిస్తున్నట్టుగా జమానాలో ప్రకటించాడు ఆర్జీవి. తర్వాత ఆ చిత్రం గురించి అప్డేట్స్ ఏం లేకపోవడంతో అందరూ మర్చిపోయారు.
అయితే వర్మ మాత్రం ఆ షార్ట్ ఫిల్మ్ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసి మరో రచ్చకి తెరలేపాడు.ఇక ఆ లఘు చిత్రానికి గాడ్..సెక్స్ అండ్ ట్రూత్ అని టైటిల్ పెట్టగా.. ఫస్ట్ లుక్ మాత్రం బోల్డ్‌గా ఉందని చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆ ఫస్ట్ లుక్‌లో మాల్కోవా ఒంటి పై నూలుపోగు లేకుండా.. నగ్నంగా ఒక సోఫా మీద కూర్చుని ఉండగా.. ఆ హాటీకి ఎదురుగా కింద కూర్చొని.. ఆమెకు సీన్ ఎక్స్ ప్లెయిన్ చేస్తున్న రామ్ గోపాల్ వర్మ.. ఇలా ఆ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.
అయితే ఈ షార్ట్ ఫిల్మ్‌ను యూరప్‌లో చిత్రీకరించినట్టుగా తెలుస్తున్నా.. వర్మ మాత్రం ఇందులో ఏం కంటెంట్ పెట్టాడో అని సర్వత్రా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే సినిమా టైటిల్లో దేవుడి ప్రస్తావన వివాదంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. టైటిల్ తోనే గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ అంటూ.. వర్మ వార్తల్లోకి వచ్చేశాడు. ఆల్రెడీ ఇలాంటి బోల్డ్ షార్ట్ ఫిల్మ్‌లు చాలా వివాదాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ చెక్కిన షార్ట్ ఫిల్మ్ ఏ రేంజ్లో మంటలను రాజేస్తుందో చూడాలి.