అవును. 2018 సంవత్సరంలో ప్రభాస్ సరికొత్త నిర్ణయం తీసుకున్నాడట. అయితే, ఈ నిర్ణయం తన పెళ్లి గురించే అయి ఉంటుందిలే అనుకుంటే పొరపాటేనండోయ్. బాహుబలి (పార్ట్ వన్, పార్ట్ – 2) చిత్రాలతో రికార్డుల మోత మోగించిన రెబల్‌స్టార్ ప్రభాస్ ఇప్పుడు సాహోతో అభిమానులను అలరించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే, 2018 సంవత్సరంలో అభిమానులను అలరించేందుకు ప్రభాస్ షాకింగ్ డెసీషన్ తీసుకున్నాడట. అయితే, అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న భాగమతి చిత్రాన్ని ప్రభాస్ తన సొంత బ్యానర్లో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అలాగే, బాహుబటి చిత్రం కోసం నాలుగేళ్లు గ్యాప్ తీసుకున్న ప్రభాస్ ఇకపై వరుసపెట్టి చిత్రాలు తీసి తన అభిమానులకు మరింత దగ్గరవ్వాలని ప్లాన్ చేశాడట. అంటే ఇక నుంచి రెబల్ స్టార్ ప్రభాస్ వరుస చిత్రాలత్ తన అభిమానులను అలరించనున్నాడన్నమాట.