మీరు చదివింది నిజమే ..గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అధికారానికి దూరం కావడానికి ప్రధాన కారణమైన ప్రముఖ స్టార్ హీరో ,పవర్ స్టార్ ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే ప్రాణమిచ్చే అభిమానులు తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు .అసలు విషయానికి పవనన్నకు ప్రాణమిస్తాం…జగనన్నకు ఓటు వేస్తాం… అనే స్లోగన్ తో ఉన్న ఫ్లెక్సీలు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి.
అజ్ఞాతవాసి సినిమా విడుదల సందర్భంగా రజక, కాపు యువసేనకు చెందిన వ్యక్తులు శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. ఈ కటౌట్‌లు ఇప్పుడు ఏపీలో వైరల్‌గా మారాయి. కంటెంట్ ఉన్నోడు జగన్ అన్న.. ఆయనకు కటౌట్ అవసరం లేదంటున్నారు జగన్ అభిమానులు..
పవన్ ఫాలోయర్స్ కూడా జగన్‌కే ఓటు వేస్తారనేందుకు ఈ కటౌట్ ఒక ఉదాహరణ అని చెబుతున్నారు. దీంతో ఇప్పుడు ఈ ఫోటోకు విపరీతంగా కామెంట్లు కూడా వస్తున్నాయి. సినిమాల పరంగా తాము పవన్ ఫ్యాన్స్ అని రాజకీయంగా జగన్‌కు మద్దతిస్తామని ఎక్కువమంది కామెంట్లు పెట్టడం విశేషం.