గ్రేటర్ వరంగల్ 44వ డివిజన్ ఉప ఎన్నికలో బాగంగా ఈ రోజు కౌంటింగ్ జరిగిన విషయం తెలిసిందే..మూడు రౌండ్ లలో ఆదిక్యం కనబరిచి తెరాసా అభ్యర్ది అనిశెట్టి సరిత 835ఓట్ల మెజారిటీతో విజయం సాదించింది.ఈ సందర్బంగా తెరాసా శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.ఈ సందర్బంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మేయర్ నరేందర్ మాట్లాడుతూ.. మా ప్రభుత్వ పాలనకు,నగర అభివృద్దికి ప్రజలు పట్టం కట్టారని,సానుబూతి మరిచి పోటీలో నిలిచిన పార్టీకి ప్రజలు సరైన రీతిలో బుద్ది చెప్పారని మేయర్ అన్నారు.
ఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అన్నచ పార్టీలను తమ ఇండ్లకు వెల్లి అభ్యర్ధించామని తన భర్తను కోల్పోయిన అనిశెట్టి సరిత కు మద్దతుగా నిలవాలని కోరామని ,తన భర్తను కోల్పోయి బాదలో తనను ప్రజల్లో తిప్పకుండా ఏకగ్రీవానికి సహకరించాలని ప్రతీ పార్టీ వారిని కోరామని దీనికి అన్నీ పార్టీలు సహకరించాయని కానీ సాటి మహిళ అనే విషయాన్ని మరిచి బీజేపీ అద్యక్షురాలు రావు పద్మ అభ్యర్దిని నిలిపిందని ప్రజలు తమ ఓటుతో ఆమెకు సరైన గుణపాఠం ఇచ్చారని తెలిపారు.ఈ ఎన్నిక అనిశెట్టి సరితకు ,సంతోష్ రెడ్డికి మద్య జరిగిన ఎన్నిక కాదని.రావు పద్మకి అనిశెట్టి సరితకు మద్య జరిగిన ఎన్నిక అని మేయర్ అన్నారు.రావు పద్మ ఒక జిల్లా అద్యక్షురాలుగా కాకుండా ఒక కార్పోరేటర్ స్థాయిలో వ్యవహరించిందని, సాటి మహిళ అనే సోయి మరచి సానుబూతి చూపకుండా అభ్యర్దిని నిలిపి ,తెరాసపై విషప్రచారం చేసిన రావు పద్మకు ప్రజలు తగిన జవాభిచ్చారని మేయర్ అన్నారు.
పశ్చిమ నియోజకవర్గంలో తమను తాను అతిగా ఊహించుకుని ఈ ఎన్నికద్వారా బంగపడ్డారని,ఈ ఎన్నికలో తమకు విజయాన్నిందించిన ప్రజలకు దన్యవాదాలు తెలిపారు మేయర్ నరేందర్.ముఖ్యమంత్రి కేసీఆర్ గారు,పురపాలక శాఖామాత్యులు కేటీఆర్ గారు ఈ నగరంలో చేస్తున్న అభివృద్దిని ప్రజలు హర్షించారని అందుకు ఈ ఎన్నిక నిదర్శనమని మేయర్ నరేందర్ అన్నారు.మా ఎన్నికకు సహకరించి పోటీ నుండి విరమించుకున్న పార్టీలకు దన్యవాదాలు తెలిపారు మేయర్ నరేందర్.