Home / ANDHRAPRADESH / రాష్ట్రము విడిపోక ముందు ఫ్లెక్సీలు చించివేత్త..ప్రస్తుతం పాలాభిషేకం…

రాష్ట్రము విడిపోక ముందు ఫ్లెక్సీలు చించివేత్త..ప్రస్తుతం పాలాభిషేకం…

కేసీఆర్‌… ఈ మూడు అక్షరాల పేరు పలకాలన్నా… చెవులారా విన్నాలన్నా… సీమాంధ్రులు భగ్గుమనేవారు. సెంటిమెంట్‌లో ఆయింట్‌మెంట్‌ పూసి రాష్ట్రాన్ని ముక్కలు చేశారని మండిపడేవారు. తెలంగాణ ఉద్యమ సమయం నాటి సంగతి. కానీ సీను రివర్స్‌ అయింది. ఇప్పుడు కేసీఆర్‌ అంటే ఎక్కడ లేని అభిమానం చూపిస్తున్నారు. ఆ పేరు చెబితే పులకరించిపోతున్నారు. ఫైనల్‌గా చెప్పాలంటే కేసీఆర్‌ అంటే నవ్యాంధ్రులకు ఇప్పుడో హీరో… ఓ స్పెషల్‌ అట్రాక్షన్‌. కారణమేంటి? అప్పుడు చేదైన మనిషి… ఇప్పుడు చక్కెర ఎందుకుయ్యారు? తెలంగాణ ఉద్యమం పీక్‌ స్టేజీలో ఉన్న సందర్భంలో కేసీఆర్ అనే మూడక్షరాల పేరు వింటే సీమాంధ్రులకు ఒళ్లు మండిపోయేది. రెచ్చకొట్టి రాష్ట్రాన్ని ముక్కలు చేశాడని ఒంటికాలిపై లేచేవారు. ఏపీ ప్రజలకు కేసీఆర్‌ అప్పుడో విలన్‌. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. కేసీఆర్‌కు ఏపీలోనూ ఫ్యాన్స్‌ పెరిగిపోయారు. రాష్ట్రం విడిపోయి మూడున్నరేళ్లయింది. ఎవరి పాలన వారిది. ఎవరి రాజ్యం వారిది. ప్రజల ఆలోచనల్లో కూడా ఆ మార్పు బాగా కనిపిస్తుంది. విభజన తర్వాత తెలంగాణలో కేసీఆర్ పాలన చూసిన ఏపీ జనం తెగ  ముచ్చటపడిపోతున్నారు.

అమరావతి శంకుస్థాపనలోనే చూడండి. అంతటి సభపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కేసీఆర్‌ పేరు పలుకుతున్నప్పుడు, కేసీఆర్‌ వేదిక ఎక్కుతున్నప్పుడు మాట్లాడేందుకు పోడియం వద్దకు వెళ్తున్నప్పుడు.. ప్రసంగం ముగించిన తర్వాత… ఇలా కేసీఆర్‌ కంటికి కనిపించిన ప్రతీసారి… కేసీఆర్‌ మాట వినిపించిన ప్రతిసారీ సభికుల నుంచి భారీగా హర్షధ్వానాలు వినిపించాయి. అనంతపురం జిల్లా వెంకటాపురంలో పరిటాల శ్రీరామ్‌ పెళ్లికి వెళ్లినప్పుడు కూడా కేసీఆర్‌కు అదే స్థాయిలో స్వాగతం పలికారు. శ్రీరామ్‌ దంపతులను ఆశీర్వదించేందుకు కేసీఆర్‌ వేదికపైకి వెళ్తున్నప్పుడు, అభివాదం చేస్తున్నప్పుడు జనం జేజేలు పలికారు. నీరాజనం పలికారు. అంతెందుకు ఆ మధ్య కేసీఆర్ విజయవాడ వెళ్లినప్పుడు కేసీఆర్‌ను స్వాగతిస్తూ ఫ్లెక్సీలు కట్టారు.

తాజా సంఘటననే చూద్దాం. కేసీఆర్‌ ఫ్లెక్సీని బెజవాడలో పాలు, పూలతో అభిషేకించారు యాదవులు. తెలంగాణలో రాజ్యసభ సీటు యాదవులకు కేటాయిస్తామన్న కేసీఆర్‌ హామీని గుర్తుచేసుకుంటూ యాదవ యువభేరీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో యాదవులకు తగిన గౌరవం, గుర్తింపు దక్కలేదని ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం యాదవులకు ఇస్తున్న గౌరవం ఎనలేనిదని యాదవులంతా ప్రశంసించారు. ఏపీలోని 13 జిల్లాల్లో కేసీఆర్‌ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేస్తామని యాదవ యువభేరీ తెలిపింది.పరిస్థితిలో ఇంత మార్పు ఎలా వచ్చింది? దీనికీ ఓ లెక్కుందంటోంది టీఆర్ఎస్‌ వర్గం. కేసీఆర్ అభివృద్ధిపైనే ఎక్కువగా దృష్టి పెట్టడం, సంక్షేమ పథకాలు పక్కాగా అమలు చేయడం ఇవే ఏపీ జనాన్ని ఆలోచింపచేస్తున్నాయంటున్నారు గులాబీ నేతలు. మొత్తానికి ఏపీలో కేసీఆర్ అంటే సానుకూల వాతావరణం, స్పెషల్‌ అట్రాక్షన్‌ కనిపించడం పాజిటివ్‌ వైబ్రేషన్స్‌ అంటోంది గులాబీదళం. @VNEWS STORY

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat