ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత యాబై తొమ్మిది రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో పాదయాత్రను నిర్వహిస్తున్నారు.జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.
రైతులు ,మహిళలు ,యువత ,విద్యార్థులు జగన్ ను కల్సి తమ సమస్యలను ఏకరవు పెట్టుకుంటున్నారు.ఈ సందర్భంగా మరో ఏడాదిలో మన ప్రభుత్వం వస్తుంది.మీ సమస్యలన్నీ తీరుతాయి అని భరోసాను కల్పిస్తూ పాదయాత్రలో ముందుకు సాగుతున్నారు వైఎస్ జగన్ .అయితే తాజాగా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీచేసే అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
ఇటివల చిత్తూరు జిల్లాలో కుప్పం నియోజకవర్గం నుండి వైసీపీ తరపున పోటీచేసే అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారి అయిన చంద్రమౌళిను ప్రకటించగా తాజాగా కర్నూలు అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒకర్ని ఖరారు చేసినట్లు ఆపార్టీకి చెందిన నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రకటించారు.ఆయన మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ నియోజక వర్గం నుండి పోటీచేసే అభ్యర్థిగా హఫీజ్ ఖాన్ ను పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖరారు చేశారు అని ఆయన తెలిపారు ..