రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా రేగొండ మండలంలోని ఎస్సారెస్పీ కాలువల మరమ్మతు పనులను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు.ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లడారు.కాంగ్రెస్ పార్టీ నాయకులూ ప్రెస్ మీట్ లకే పరిమితం మయ్యరని అన్నారు . కాంగ్రెస్ పార్టీ నాయకులు గాంధీ భవన్ లో పూట కో ప్రెస్ మీట్ పెట్టి అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.. గాంధీ భవన్ కాదు.ప్రజల్లోకి రండి.తేల్చుకుంధాం అని ఈ సందర్బంగా సవాల్ విసిరారు .
కాంగ్రెస్ హయాంలో రైతులకు సాగునీరివ్వలేదు. ఎరువులు, వితనాలు ఇవ్వలేదని అన్నారు . మా ప్రజాప్రతినిధులు చెరువులు,కాల్వల వెంట ఉంటున్నారు. కాంగ్రెస్ నాయకులు ఏనాడైనా ప్రజల్లో తిరిగారా?సమస్యలు తెలుసుకున్నారా?పరిష్కరించారా? అని ప్రశ్నించారు .గత కాంగ్రెస్ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి సన్నిహితుడే భూపాలపల్లి ఎం.ఎల్.ఎ గా, చీఫ్ విప్ గా పని చేసిన వ్యక్తి ఈ నియోజకవర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు .దేవాదుల నుంచి భూపాలపల్లి నియోజకవర్గంలో గతంలో 300 ఎకరాలకు కూడా సాగునీరందలేదన్నారు . మేము 30 వేల ఎకరాలకు నీరిస్తున్నాం.గత సంవత్సరం 47 చెరువులు నింపాము.ఎండనకా, వాననకా మేము ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం.మరో ఇరవై ఏళ్ళ పాటు టీఆరెస్ అధికారం లో ఉంటుందని ఈ సందర్బంగా దీ మా వ్యక్తం చేశారు .
టీఆరెస్ ను ఎవరూ ఏమీ చేయలేరు.బీహార్, కర్ణాటక తదితర రాష్ట్రాల మంత్రులు టీఆరెస్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రశంసిస్తున్నారని అన్నారు . తమిళ నాడు, మహారాష్ట్ర వంటి పలు రాష్ట్రాల ప్రతినిధులు, అధికారులు మిషన్ కాకతీయను పొగుడుతుంటే…ఇక్కడి కాంగ్రెస్ నాయకులకు మింగుడు పడడం లేదన్నారు .పూర్వ వరంగల్ జిల్లా త్వరలోనే సస్యశ్యామలం అవుతుంది. చిట్టచివరి ఆయకట్టు రైతుకు నీరందిస్తాం.సంక్రాంతి నాటికి దేవాదుల మోటార్లు ప్రారంభించనున్నాం.పెద్దపల్లి-భూపాలపల్లి మధ్య ఒక చెక్ డ్యాం నిర్మాణానికి వ్యాప్కోస్ సర్వే చేస్తుందన్నారు.కాళేశ్వరం చూసి కేంద్ర జలసంఘం ఆశ్చర్య పోతున్నదని అన్నారు . త్వరలోనే ఈ ప్రాజెక్ట్ రికార్డు సృష్టించబోతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఒక్కరోజు 2 లక్షల సిమెంట్ బస్తాలు వాడుతున్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోరైతులకు ఎరువులు, వితనాల కొరత లేదు.1000 కోట్ల తో గోడౌన్ల సామార్ఢ్య పెంచుతున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, స్పీకర్ మధుసూదనాచారి, అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.