ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తాను చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. సమస్యలకు పరిష్కార మార్గాలను రచిస్తూ.. ప్రజల్లో భరోసా నింపుతూ ముందుకు సాగుతున్నారు. అయితే, జగన్ ప్రజల కోసం చేపట్టిన పాదయాత్రలో.. తాము సైతం అంటూ మహిళలు, యువత, వృద్ధులతోపాటు దివ్యాంగులు కూడా అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. తమకు ఎంత కష్ట మైనా సరే.. వైఎస్ జగన్‌ను సీఎంగా చూసేందుకు ఎంత దూరమైనా నడుస్తామని, వస్తామని చెప్తున్నారు.
ఇదిలా ఉంటే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్గీ గుర్తుపై గెలిచి.. అటు ప్రజల నమ్మకాన్ని.. ఇటు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నమ్మకాన్ని వమ్ము చేస్తూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు డబ్బుల మూటలు చూసి పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి ఫిరాయించినా.. ఎంతో మనోధైర్యంతో వైఎస్ జగన్ పాదయాత్ర చేయడం గమనార్హంం. వైఎస్ జగన్ తాను చేపట్టిన పాదయాత్ర ఇప్పటికే కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పూర్తిచేసుకుని చిత్తూరు జిల్లాలో ప్రస్తుం కొనసాగుతున్న విషయం తెలిసిందే.
కాగా, అనుక్షణం ప్రజల మధ్యనే ఉంటూ.. వారి సమస్యలను స్వయంగా తెలుసుకుంటూ.. పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్న జగన్‌పై ప్రజల్లో మరింత ఆదరణ పెరిగిందన్న విషయం చెప్పడంలో అతిశయోక్తి లేదు. జగన్ ఏ గ్రామంలోకి ఎంటరైనా సరే ప్రజలు స్వాగత హారతులతో బ్రహ్మరథం పడుతున్నారు. తన వద్దకు ఎవరు వచ్చిన ఆప వద్దని వైఎస్ జగన్ తన సెక్యూరిటీని కూడా ఆదేశించారు. అటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి.. ఇటు సామాన్య ప్రజల వరకు ప్రతీ ఒక్కరు జగన్ పాదయాత్రలో భాగమవుతూ.. జగన్ వెంట నడుస్తున్నారు. ఇలా ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఏకరువు పెడుతున్నారు వైఎస్ జగన్. ప్రజలు చెబుతున్న అన్ని సమస్యలను వైఎస్ జగన్ శ్రద్ధగా వింటున్నారు. ఇలా ప్రజల మధ్యన ఉండేలా చేసిన ప్రజా సంకల్ప పాదయాత్ర జగన్‌కు ఆక్సిజన్‌లా పనిచేస్తుందని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.